Chandramohan : టాలీవుడ్‌లో మోస్ట్ టాలెంటెడ్ ఆర్టిస్ట్‌లో చంద్రమోహన్ ఒకరు. మొదట్లో ఆయన హీరోగా అనేక సినిమాలు చేసి తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారారు. ఎంతో మంది హీరోయిన్స్‌కి లైఫ్ ఇచ్చిన చంద్రమోహన్ కెరీర్‌లో మాత్రం పెద్దగా ఎదగలేకపోయారు. చంద్రమోహన్ రంగులరాట్నం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరవాత 175 సినిమాలలో ఆయన హీరోగా నటించాడు. అంతే కాకుండా చంద్రమోహన్ 900లకు పైగా చిత్రాలలో నటించి మెప్పించారు. అయితే అన్ని చిత్రాలలో నటించిన చంద్రమోహన్ తన ఇద్దరు కూతుళ్లు మాత్రం సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. ఈ విషయం పై చంద్రమోహన్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చంద్రమోహన్ తనకి ఉన్న పలుకుబడితో తమ పిల్లలను కూడా స్టార్లను చేస్తారు అని అంతా అనుకున్నారు. కానీ చంద్రమోహన్ తన ఫ్యామిలీని సినిమాలకు దూరంగా ఉంచారు.’నా ఇద్దరు కుమార్తెలు.. బాగుంటారని, ఒకానొక సమయంలో భానుమతి గారు చెప్పుకొచ్చారు. పిల్లలిద్దరినీ చైల్డ్ ఆర్టిస్టులుగా చేద్దామని కూడా ఆమె అడిగారు, కానీ నేను వద్దన్నాను. నటుడిగా బిజీగా ఉన్న రోజుల్లో నాకు పిల్లలతో గడిపే సమయం ఉండేది కాదు. అంతేకాదు పిల్లలు ఎప్పుడైనా లోకేషన్ కు వచ్చినా వాళ్లు నన్ను గుర్తు పట్టే వాళ్లు కాదు. ఒకసారి సినిమా షూటింగ్ చూపిస్తే మళ్లీ షూటింగ్ ఎప్పుడు అడుగు అని అడుగుతారని భయం వేసేదని చెప్పుకొచ్చారు.
తన పిల్లలపై సినిమా ప్రభావం వాళ్ళపై పడకుండా ఇద్దరిని పెంచారు. వారు బాగా చదివి గోల్డ్ మెడల్స్ సాధించారని తెలిపారు. ఇద్దరు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డట్టు తెలుస్తుంది. చంద్రమోహన్ సొంత తమ్ముడు కూతురు మాత్రం కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘సప్తపది’ మూవీలో నటించింది.ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇక చంద్రమోహన్ తమ్ముడి కూతురు పేరు సబిత కాగా, ఈ సినిమా తర్వాత ఆమెకు అనేక ఆఫర్లు క్యూ కట్టాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…