Alluri Character : అల్లూరి పాత్ర‌లో న‌టించి మెప్పించిన స్టార్ హీరోలు వీళ్లే..!

Alluri Character : సినిమా ఇండస్ట్రీ లవ్, యాక్షన్ కథల సినిమాలే కాకుండా, స్వాతంత్ర సమరయోధులు, విప్లవవీరుల కథలతో తెరకెక్కిన సినిమాలు కూడా ఉన్నాయి. వీటిలో కూడా నటించి మెప్పించిన హీరోలు ఎంతో మంది ఉన్నారు. ఇందులో ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు పాత్రలో ఇప్పటివరకు చేసిన హీరోలు ఎవ‌రో ఓ లుక్కేద్దాం. అల్లూరి సీతారామరాజు పాత్ర అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే హీరో కృష్ణ. వి.రామచంద్రరావు డైరెక్షన్ లో, త్రిపురనేని మహారథి కథ అందించగా, కృష్ణ సోద‌రుడు జి. హనుమంతరావు ఈ మూవీని నిర్మించారు. ఈ మూవీ 1974 లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

అలనాడు అల్లూరి పాత్రలో చేయాలని ఎన్టీఆర్ ఎంతో ఆశపడ్డారు. ఆ సమయంలోనే సూపర్ స్టార్ కృష్ణ ఈ ప్రాజెక్టు చేయడంతో సినిమా సూపర్ హిట్ అయింది. అయినా ఎన్టీఆర్ కు ఆ పాత్రలు చేయాలని ఆశ మాత్రం తగ్గలేదు. దీంతో కే. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన మేజర్ చంద్రకాంత్ మూవీలో కాసేపు అల్లూరి పాత్రలో కనిపించి ఆయన ఆశను తీర్చుకున్నారు. అల్లూరి సీతారామరాజు పాత్ర చేయాలని నందమూరి బాలయ్య కూడా ఆశపడ్డారు. భారతంలో బాలచంద్రుడు అనే మూవీతో అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించి తన ముచ్చట తీర్చుకున్నారు.

these actors acted in Alluri Character
Alluri Character

తాజాగా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించి మెప్పించారు. కృష్ణ తర్వాత ఆ పాత్రకి జీవం పోసిన హీరోగా రామ్ చరణ్ నిలిచారు.

editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

2 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

2 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

5 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago