Ileana : గోవా బ్యూటీ ఇలియానా పెద్ద షాకే ఇచ్చింది. ఈ అమ్మడు ప్రస్తుతం సినిమాలు లేక చాలా ఖాళీగా గడుపుతుంది. అయితే సోషల్ మీడియా ద్వారా అభిమానులని అలరించే ప్రయత్నం చేస్తుంది. తాజాగా తన మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు ఆమె సోషల్ మీడియాలో తెలిపింది ఇలియానా. రెండు ఫోటోలను షేర్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో తన ప్రెగ్నెన్సీని ప్రకటించింది ఇలియానా. త్వరలో.. నిన్ను కలవడానికి ఎదరుచూస్తున్నాను.. నా చిట్టి డార్లింగ్ ” అంటూ ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్టులో రెండు ఫొటోలు ఉన్నాయి. మొదటి చిత్రంలో ఓ టీ షర్ట్ ఉంది. దానిపై “ఇక సాహసయాత్ర మొదలవుతుంది” అని రాసి ఉంది. మరొక చిత్రంలో ఒక లాకెట్ ఉంది.
ఈ ఫోటోలకు ఆమె పోస్ట్ పెడుతూ, `కమింగ్ సూన్, నా చిన్నారి డార్లింగ్‌ని కలిసేందుకు ఆతృతతో ఉన్నాను అని కామెంట్ పెట్టడంతో ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది. ఇలియానా ఇంత సడెన్‌గా తన ప్రెగ్నెన్సీని ప్రకటించడం ఏంటి అని అందరిని ఆశ్చర్యపరుస్తుంది. దీంతో నెటిజన్లకి అనేక అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఇప్పటి వరకు తన పెళ్లి మ్యాటర్ బయటకు అయితే రాలేదు. కనీసం ఆమె ప్రేమలో ఉన్నారనే వార్త కూడా లేదు. మరి ఇప్పుడు సడెన్‌గా ఈ ప్రెగ్నెన్సీ అనే దానిపై అందరిలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఇలియానాకి శుభాకాంక్షలు చెప్పేవారికంటే ప్రశ్నలు సందిస్తున్నవారే ఎక్కువైపోయారనీ తెలుస్తుంది.. మాకు తెలియకుండా పెళ్లెప్పుడు చేసుకున్నావని, ఇంతకి ఆ చిన్నారికి తండ్రి ఎవరు ? , ఫాదర్ నేమ్ చెప్పవా అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. హిందీలో నాలుగేళ్ల కిందట నటించిన ‘ది బిగ్ బుల్’ సినిమా ఆమెకు చివరిది కాగ, తాజాగా ఓ మ్యూజిక్ వీడియో ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది . పాపులర్ ర్యాపర్ బాద్‌షా మ్యూజిక్ వీడియోలో ఇలియానా తళుక్కుమంది. ‘సబ్ గజాబ్’ పేరుతో తెరకెక్కిన ఈ వీడియోలో ఇలియానా చాలా సెక్సీగా కనిపించి తన అభిమానులని ఎంతగానో అలరించింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…