Jr NTR : ఇటీవల ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ సినిమాలు రూపొందుతున్న విషయం తెలిసిందే. చిన్న హీరోలతో పాటు పెద్ద హీరోలు కూడా మల్టీ స్టారర్స్‌పై ఆసక్తి చూపుతున్నారు. అయితే ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కగా, ఈ మూవీకి ఆస్కార్ అవార్డ్ కూడా దక్కింది. అయితే ప్రస్తుతం కొరటాల శివతో సినిమా చేస్తున్న సినిమా రానున్న రోజులలో వరుస మల్టీ స్టారర్స్ చేయడానికి తెగ ఆసక్తి చూపుతన్నాడు.
ఎన్టీఆర్ త్వరలో హిందీ లో హృతిక్ రోషన్ తో కలిసి ‘వార్ 2’ చేస్తున్నాడు.ఈ సినిమా పూర్తైన తర్వత ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. ఇక ఈ సినిమా పూర్తైన తర్వత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి ఒక మల్టీస్టార్ర్ర్ మూవీ చెయ్యబోతున్నట్టు బాలీవుడ్ మొత్తం ఇప్పుడు కోడై కూస్తుంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య థార్ ఎన్టీఆర్ – అల్లు అర్జున్ ని పౌరాణిక నేపథ్యం లో ‘ది ఇమ్మోర్తల్స్ ఆఫ్ అశ్వద్దామా’ అనే చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. ఇటీవలే ఇద్దరు హీరోలకు కలిసి స్టోరీ లైన్ వినిపించగా, ఇద్దరి నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందట.
పూర్తి స్థాయి స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకొని రమ్మని డైరెక్టర్ కి చెప్పడంతో వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా చూడడం గ్యారెంటీ అని కొందరు భావిస్తున్నారు. టాలెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఈ ఇద్దరు కలిసి ఒక సినిమాలో నటిస్తే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ఏ రేంజ్ లో బద్దలు అవుతుందో అని అందరు అంచనాలు చేస్తున్నారు. ఎన్టీఆర్, బన్నీ పోటా పోటీగా డ్యాన్స్ లు చేస్తారు కాబట్టి వారిద్దరు కలిసి బాక్సాఫీస్‌ని షేక్ చేయడం గ్యారెంటీ అంటున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ తో కలిసి ‘పుష్ప : ది రూల్’ చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అవ్వగానే ఆయన సందీప్ రెడ్డి వంగ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యాక ఈ క్రేజీ మల్టీస్టార్ర్ర్ సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…