Alluri Character : సినిమా ఇండస్ట్రీ లవ్, యాక్షన్ కథల సినిమాలే కాకుండా, స్వాతంత్ర సమరయోధులు, విప్లవవీరుల కథలతో తెరకెక్కిన సినిమాలు కూడా ఉన్నాయి. వీటిలో కూడా నటించి మెప్పించిన హీరోలు ఎంతో మంది ఉన్నారు. ఇందులో ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు పాత్రలో ఇప్పటివరకు చేసిన హీరోలు ఎవరో ఓ లుక్కేద్దాం. అల్లూరి సీతారామరాజు పాత్ర అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే హీరో కృష్ణ. వి.రామచంద్రరావు డైరెక్షన్ లో, త్రిపురనేని మహారథి కథ అందించగా, కృష్ణ సోదరుడు జి. హనుమంతరావు ఈ మూవీని నిర్మించారు. ఈ మూవీ 1974 లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.
అలనాడు అల్లూరి పాత్రలో చేయాలని ఎన్టీఆర్ ఎంతో ఆశపడ్డారు. ఆ సమయంలోనే సూపర్ స్టార్ కృష్ణ ఈ ప్రాజెక్టు చేయడంతో సినిమా సూపర్ హిట్ అయింది. అయినా ఎన్టీఆర్ కు ఆ పాత్రలు చేయాలని ఆశ మాత్రం తగ్గలేదు. దీంతో కే. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన మేజర్ చంద్రకాంత్ మూవీలో కాసేపు అల్లూరి పాత్రలో కనిపించి ఆయన ఆశను తీర్చుకున్నారు. అల్లూరి సీతారామరాజు పాత్ర చేయాలని నందమూరి బాలయ్య కూడా ఆశపడ్డారు. భారతంలో బాలచంద్రుడు అనే మూవీతో అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించి తన ముచ్చట తీర్చుకున్నారు.
![Alluri Character : అల్లూరి పాత్రలో నటించి మెప్పించిన స్టార్ హీరోలు వీళ్లే..! these actors acted in Alluri Character](http://3.0.182.119/wp-content/uploads/2023/04/alluri-character.jpg)
తాజాగా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించి మెప్పించారు. కృష్ణ తర్వాత ఆ పాత్రకి జీవం పోసిన హీరోగా రామ్ చరణ్ నిలిచారు.