Headache : ప్రస్తుత తరుణంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో తలనొప్పి ఒకటి. ఇది వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. తలనొప్పి అనేది చిన్న సమస్యే అయినా ఇది వస్తే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏ పని చేయబుద్ధి కాదు. అయితే దీనికి ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడాల్సిన పనిలేదు. మనకు లభించే సహజసిద్ధమైన పదార్థాలతోనే తలనొప్పి నుంచి బయట పడవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సజ్జలను తినడం వల్ల తలనొప్పి ఇట్టే తగ్గిపోతుంది. వీటిలో మెగ్నీషియం, రిబోఫ్లావిన్ ఎక్కువగా ఉండటం వల్ల తలనొప్పిని తగ్గించడానికి సహాయ పడుతాయి. మెగ్నీషియం మైగ్రేయిన్ తలనొప్పిని నయం చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. అందువల్ల సజ్జలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే నువ్వులలో ఉన్న పోషకాలు తలనొప్పిని తగ్గిస్తాయి. వీటిలో ఉండే ఐరన్ రక్తనాళాలను సంకోచ ప్రమాదాన్ని తగ్గించడం ద్వారా మైగ్రేయిన్ తల నొప్పిని తగ్గిస్తాయి. అందువల్ల నువ్వులను కూడా తరచూ తీసుకోవాలి.
ఇక భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి అల్లాన్ని వంట ఇంటి పదార్థంగా ఉపయోగిస్తున్నారు. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల తలనొప్పి తగ్గుతుంది. రోజూ పరగడుపునే లేదా భోజనం చేసే ముందు కాస్త అల్లం రసం తీసుకుంటే తలనొప్పి తగ్గడంతోపాటు జీర్ణ సమస్యల నుంచి కూడా బయట పడవచ్చు. ఇక బాదంపప్పు కూడా తలనొప్పిని తగ్గించగలవు. ఇవి రక్తనాళాలు, కండరాలను ప్రశాంత పరుస్తాయి. దీంతో తలనొప్పి తగ్గుతుంది. కాబట్టి బాదంపప్పును కూడా రోజూ తినాలి. ఇక తలనొప్పిని తగ్గించేందుకు ఉపయోగపడే మరో సహజసిద్ధమైన పదార్థం అరటి పండు. ఇందులో మెగ్నిషియం, పొటాషియం అధికంగా ఉండడం వల్ల తలనొప్పి ఇట్టే తగ్గిపోతుంది. కనుక ఈ పదార్థాలను ఆహారంలో భాగం చేసుకుంటే.. తలనొప్పి తగ్గిపోతుంది.