కొద్ది నెలల క్రితం దక్షిణాది చిత్ర పరిశ్రమతోపాటు దేశవ్యాప్తంగా భారీ చర్చకు దారి తీసిన చిత్రం ది లెజెండ్. తమిళనాడులో శరవణన్ గ్రూప్ అధినేత శరవణన్ అరుల్ హీరోగా నటించిన ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా రిలీజై అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా రిలీజ్‌కు ముందు సంపాదించుకొన్న క్రేజ్‌ను బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లుగా ఏ మాత్రం మలచలేకపోయింది. ది లెజెండ్ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం 66 కోట్లు రాబట్టాల్సి ఉండగా, అది అందుకోలేక చితికిల పడింది.. ది లెజెండ్ చిత్రం 2022లో భారీ నష్టాలకు గురైన చిత్రంగా రికార్డును నమోదు చేసింది.
65 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తే ఈ సినిమా సుమారు మూడు కోట్లు కూడా రాబట్టలేకపోయింది. దాంతో ఈ చిత్రం 62 కోట్లకుపైగా నష్టాల్ని బాక్సాఫీస్ వద్ద చవిచూసింది. అజిత్ హీరోగా నటించిన ఉల్లాసం సినిమాను తెరకెక్కించిన జీడీ జెర్రీ దర్శకత్వం వహించాడు. హ్యారిస్ జైరాజ్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమాలో హాట్ బ్యూటీ ఊర్వశి రౌథాలా కథానాయికగా నటించింది. అయితే గత చిత్రంతో చేతులు కాల్చుకున్నప్పటికీ శరవణన్ మరోసారి భారీ బడ్జెట్‌తో చిత్రం రూపొందించేందుకు సిద్ధమయ్యాడు.
తన తదుపని సినిమాని కాశ్మీర్ లో షూటింగ్ జరగుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అప్ డేట్ త్వరలో రానున్నట్లు తమిళ మీడియా చెబుతోంది. కాశ్మీర్ లో ఆయన దిగిన కొన్ని ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ మారడంతో సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుందని అనుకుంటున్నారు.. అయితే ఈ సినిమాకు మరింత బడ్జెట్ పెట్టనున్నట్లు సమాచారం. రూ. 50 కోట్లకు పైగా బడ్జెట్ ఉండనుందని తెలుస్తోంది. వ్యాపార ప్రకటనలతో ఫేమస్ అయిన శరవణన్‌కు సూర్యశ్రీతో వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. ఇక సోదరి వివాహానికి రూ.13 కోట్ల విలువైన దుస్తులను బహూకరించి అప్పట్లో హాట్ టాపిక్‌గా నిలిచాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…