మోహ‌న్ బాబు దెబ్బ‌కు ఫ్లాప్ అయిన చిరంజీవి మూవీ ఏదో తెలుసా..?

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన పెదరాయుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. పాతికేళ్ళ క్రితం వచ్చిన ఈ సినిమా దెబ్బకు అప్పటి వరకు ఉన్న రికార్డులు అన్నీ కనుమరుగు అయ్యాయి అనే చెప్పాలి.. ఈ సినిమాలో మోహన్ బాబు పాత్ర హైలెట్ అనుకుంటే 20 నిమిషాల పాటు కనపడే రజనీ కాంత్ పాత్రతో సినిమా మరో రేంజ్ కు వెళ్ళింది. తమిళ సినిమా హక్కులను రజనీ కాంత్ సలహాతో కొనుగోలు చేసిన మోహన్ బాబు… తన సొంత బ్యానర్ లోనే ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇంటి పెద్దకు ఎంత విలువ ఉంటుంది అనేది ఈ సినిమాలో చూపిస్తారు.

అయితే ఈ సినిమాకి పోటీగా మెగాస్టార్ చిరంజీవి త‌న చిత్రాన్ని రిలీజ్ చేయ‌డంతో ఆయ‌న‌కి ఇది ఒక చేదు జ్ఞాపకం మిగిల్చింది అంటారు విశ్లేషకులు. జూన్ 15 1995 పెద‌రాయుడు విడుద‌ల కాగా… సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. ఈ క్ర‌మంలో మెగాస్టార్ చిరంజీవి త‌న బిగ్‌బాస్ సినిమా విడుద‌ల చేశారు. అయితే చిరు సినిమా విడుద‌ల చేయ‌డంతో పెదరాయుడు సినిమా పరిస్థితి ఏంటి అని కంగారు పడ్డారు. మొద‌టి వారంలోనే సీన్ రివ‌ర్స్‌ అయింది. సినిమా ఫలితం చూసి అందరూ అవాక్క‌య్యారు. బిగ్ బాస్ సినిమా కంటే పెదరాయుడు సినిమాకే మంచి క్రేజ్ రావడంతో థియేట‌ర్లు పెరిగినా టికెట్ల కోసం జ‌నాలు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ప్రింట్ల సంఖ్య కూడా భారీగా పెంచాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.

chiranjeevi movie flopped because of mohan babu know what it is

పెద్ద‌రాయుడు సినిమాకి వ‌చ్చిన‌ డ‌బ్బు లెక్క‌పెట్టుకోవ‌డానికి మిష‌న్లు కావాలి అనేంత‌గా ఈ సినిమాకి క‌లెక్ష‌న్లు వ‌చ్చాయి. ఈ ధాటిని త‌ట్టుకోలేక‌పోవ‌డంతో.. చిరంజీవి బిగ్‌బాస్ జెండా ఎత్తాడు. అప్ప‌టిదాకా ఘ‌రానా మొగుడు సినిమాపై ఉన్న రికార్డుల‌న్నింటీనీ పెద‌రాయుడు తిర‌గ‌రాయ‌డంతో పాటు ఈ చిత్రం 39 కేంద్రాల్లో శ‌త‌దినోత్స‌వం జ‌రుపుకుంది. సినిమాలో నటించిన సౌందర్యకు మంచి పేరు వచ్చింది. ఇప్పటికి సినిమా టీవీ లో వచ్చినా మిస్ కాకుండా చూస్తారు. అలా చిరంజీవి వంటి స్టార్ హీరోకు మోహ‌న్ బాబు అప్ప‌ట్లో పెద్ద రాయుడుతో గ‌ట్టిషాకే ఇచ్చారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago