Satyaraj Daughter Divya : బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యరాజ్. కట్టప్పగా మనందరి మనసులు కొల్లగొట్టిన సత్యరాజ్ ఎన్నో తెలుగు సినిమాలలో మంచి మంచి పాత్రలు పోషించారు. తెలుగు, తమిళ.. భాషల్లో విలక్షణమైన పాత్రలు చేస్తూ బిజీ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు సత్యరాజ్. అయితే గతంలో ఈయన కూడా ఓ స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోగా నటించి మెప్పించారు.గతంలో ‘కూని’ ‘దర్జా దొంగ’ ‘ఉక్కు సంకెళ్లు’ వంటి సినిమాల్లో ఓ హీరోగా కూడా నటించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నటుడిగా సత్యరాజ్ గురించి చాలా మందికి తెలుసు కాని ఆయన పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా తెలియదు.
సత్యరాజ్ భార్య పేరు మహేశ్వరీ. వీరికి ఇద్దరు సంతానం. సత్యరాజ్ కొడుకు సిబిరాజ్ ఆల్రెడీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ‘డోరా’ ‘మాయోన్’ వంటి సినిమాల్లో నటించాడు.ఇక సత్యరాజ్ కూతురు దివ్య ఓ న్యూట్రిషనిస్ట్. ఈమె ఫోటోలు కొన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆమెని చూసి హీరోయిన్‌ని మించిన అందం ఉందని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దివ్య చెన్నైలో న్యూట్రిషియనిస్ట్‌గా సేవలు అందిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మధ్యాహ్న భోజన పథకం అయిన అక్షయపాత్రకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న దివ్య ఆరోగ్య వ్యవస్థ సరిగ్గా లేదని, అందుకోసం తగిన మార్పులు తీసుకురావాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి రావాలనుకుంటుందని ఇటీవల వార్తలు వచ్చాయి.
రాష్ట్రంలో చాలా మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, ఆ పరిస్థితిని చక్కదిద్దడానికి రాజకీయాల్లో ఉండటం వల్లనే వ్యవస్థలో మార్పు తేవడం సాధ్యమని, అందుకోసం ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్లు దివ్య ప్రకటించారు. మరి ఈమె రాజకీయారంగేట్రం ఎప్పుడు చేస్తుందో అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…