Indra Movie : ఇంద్ర సినిమాను చేసేందుకు చిరంజీవి మొద‌ట ఒప్పుకోలేద‌ట‌.. త‌రువాత మ‌ళ్లీ ఎలా చేశారు..?

Indra Movie : మెగాస్టార్ చిరంజీవి త‌న కెరీర్‌లో ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల‌లో న‌టించారు. అందులో ఎన్నో హిట్ చిత్రాలు ఉన్నాయి. వాటిలో ఇంద్ర చిత్రం ఒక‌టి. బి గోపాల్ డైరెక్ష‌న్‌లో రాయ‌ల‌సీమ బ్యాక్ డ్రాప్‌లో యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ సినిమాని వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ పై అశ్వ‌నీద‌త్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అప్ప‌ట్లో రూ.10 కోట్ల (సుమారుగా)బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన ఈ చిత్రం బాక్సాపీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల పంట పండించింద‌నే చెప్పాలి. ఇందులో ఆర్తీ అగ‌ర్వాల్‌, సోనాలీ బింద్రే హీరోయిన్లుగా న‌టించ‌గా..ముఖేశ్ రుషి, పునీత్ ఇస్సార్, ప్ర‌కాశ్‌రాజ్‌, త‌ణికెళ్ల‌భ‌ర‌ణి, శివాజీ, బ్ర‌హ్మానందం, సునీల్‌, ధ‌ర్మ‌వ‌ర‌పు సుబ్ర‌హ్మ‌ణ్యం, ఏవీయ‌స్, అల్లు రామ‌లింగ‌య్య కీల‌క పాత్ర‌ల్లో మెరిసారు.

ఈ సినిమా విడుద‌లై 20 ఏళ్లు పైనే అయింది. ఇటీవ‌ల ర‌చ‌యిత, న‌టుడు ప‌రుచూరి గోపాల కృష్ణ అభిమానుల‌తో కొన్ని విష‌యాలు పంచుకున్నారు. తొలుత సినిమా క‌థ‌ని ద‌ర్శ‌కుడు బి.గోపాల్ వ‌ద్ద‌న్నాడట‌. అందుకు కార‌ణం స‌మ‌ర‌సింహారెడ్డి, న‌ర‌సింహానాయుడు లాంటి రెండు సినిమాల్లో కూడా హీరో పాత్ర చిత్రీక‌ర‌ణ ఇంద్ర సినిమాలో మాదిరిగానే ఉండ‌డం. ఈ సినిమా అదే క‌థాంశంతో తెర‌కెక్కిస్తే ప్లాఫ్ అవుతుందేమో అని గోపాల్ భ‌య‌ప‌డ్డార‌ట‌. అయితే చిరంజీవి.. చిన్నికృష్ణ‌తో క‌లిసి క‌థ చెప్పండని అన్నార‌ట‌. ఇంట‌ర్వెల్ వ‌ర‌కు క‌థ చెప్ప‌గానే వెంట‌నే చిరంజీవి కిళ్లీ వేసుకొని ఇక మొత్తం అవ‌స‌రం లేదు. సినిమా హిట్ అని అన్నార‌ట‌.

Indra Movie why chiranjeevi first not wanted
Indra Movie

త‌నికెళ్ల భ‌ర‌ణి పోషించిన పాత్రని త‌న‌నే చేయ‌మ‌న్నారని, డైలాగ్ రైట‌ర్ అయిన నేను మూగ పాత్ర‌లో న‌టిస్తే జ‌నాలు ఎలా స్వీక‌రిస్తారో నేను పాత్ర వ‌దులుకున్నానంటూ ప‌రుచూరి గోపాల‌కృష్ణ చెప్పుకొచ్చారు. మ‌ణిశ‌ర్మ కంపోజిష‌న్‌లో వ‌చ్చిన పాట‌ల‌న్నీ ఆల్‌టైమ్ బ్లాక్ బాస్ట‌ర్ హిట్స్ గా నిలిచాయి. మెగా బ్లాక్ బాస్ట‌ర్ 2 ద‌శాబ్దాలు పూర్తి చేసుకున్నా కూడా ఈ సినిమా ఎప్ప‌టికీ ఫ్రెష్‌గానే ఉంటుంది. 2002లో విడుదలైన ఇంద్ర సినిమా ఆ రోజుల్లోనే 125 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. చిరంజీవి కెరీర్‌లో అప్పటి వరకు లేనంత కలెక్షన్స్ ఇంద్ర తీసుకువచ్చింది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago