The Legend : రిటైల్ పరిశ్రమలో ప్రసిద్ధ వ్యాపారవేత్త, లెజెండ్ శరవణన్ గత సంవత్సరం పాన్ ఇండియన్ చిత్రం ది లెజెండ్‌తో సినీ రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. కోట్లాది రూపాయల భారీ బడ్జెట్ తో హరీష్ జైరాజ్ లాంటి టెక్నికల్ టీమ్ తో డబ్బు మంచి నీళ్లలా ఖర్చు పెట్టి మరీ ఈ సినిమా తీశారు. సుమారు డెబ్భై కోట్లకు పైగానే బడ్జెట్ అయ్యిందని ప్రచారం జరిగింది. ఈ సినిమాకి పెట్టిన లాభాలు కాదు, కనీసం పెట్టిన రూపాయి కూడా వెనక్కి రాలేదు.. అయినా శరవణన్ మళ్లీ మరో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే శరవణన్ నటించిన ది లెజెండ్ సినిమా రిలీజ్ కు ముందే వచ్చిన వీడియో సాంగ్స్ మీద బోలెడు మీమ్స్ హల్‌చల్ చేశాయి.
రవితేజ రామారావు ఆన్ డ్యూటీ, సుదీప్ విక్రాంత్ రోనాలతో పోటీగా సినిమాని రిలీజ్ చేశాడు శరవణన్. సినిమాలో హీరో తెరపై చేసే విన్యాసాలు చూసి జనం నవ్వుకున్నారు. దాంతో హీరో శరవణన్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మెటీరియల్ అయిపోయాడు. ఇప్పుడీ చిత్రం ఓటిటిలో వస్తోంది. మార్చి3 నుంచి అంటే ఈ రోజు నుంచి హాట్ స్టార్ ఓటిటిలో చూడచ్చు అన్నమాట.ఇక ఇప్పుడు మరింత ట్రోల్స్ పెరిగిపోతాయని అందరూ భావిస్తున్నారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో తమిళం, తెలుగు, హిందీ మరియు మలయాళ భాషలలో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంటుంది.
ఈ విషయాన్ని లెజెండ్ శరవణన్ స్వయంగా ప్రకటించారు. ఈ చిత్రంలో గీతిక తివారీ మరో కథానాయికగా నటించింది. నాజర్, సుమన్, ప్రభు, విజయకుమార్, లత, దేవదర్శిని, మునిష్కాంత్ ఇతర కీలక పాత్రలు పోషించారు. రజినీకాంత్ శివాజీ కథను తిప్పి ఈ సినిమా కథ రాయగా, ఇందులో శివాజిలోని విలన్ సుమన్ నే దీనికే తీసుకొచ్చి ఓ పిల్లి గెడ్డం పెట్టి మేనేజ్ చేసే ప్రయత్నం చేసాడు. ఓ ప్రాణాంతక వ్యాధికి మందు కనిపెట్టిన డాక్టర్ శరవణన్ ఎలాగైనా దాన్ని పేదలకు అందజేయాలనే లక్ష్యం పెట్టుకోగా, ఆ సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిని దాటుకొని ఎలా బయటపడ్డాడనేది సినిమా కథ.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…