IND Vs AUS : 3వ టెస్టులో టీమిండియా ఓట‌మికి ప్ర‌ధాన కార‌ణాలివే.. రోహిత్‌ను త‌ప్పుబ‌డుతున్న ఫ్యాన్స్‌..

IND Vs AUS : ప్ర‌స్తుతం టీమిండియా, ఆస్ట్రేలియా మ‌ధ్య బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ టోర్నీ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. మొద‌టి రెండు టెస్టుల్లో ఘనవిజయం సాధించిన టీమిండియా ఫుల్ జోష్ మీద ఉంది. ఎట్టకేలకు సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో మూడో టెస్టులో బ‌రిలోకి దిగిన టీమిండియా ఈ మ్యాచ్ గెలిచి డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకోవాలని కూడా అనుకుంది. ఈ క్ర‌మంలో మూడో టెస్టులో టీమిండియా జట్టు టాస్ గెలిచింది. కెప్టెన్ రోహిత్ బ్యాటింగ్ తీసుకున్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి టాపార్డర్.. కుప్పకూలింది. మొద‌టి ఇన్నింగ్స్‌లో 109 ప‌రుగుల‌కే కుప్ప‌కూలిన టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 163 ప‌రుగుల‌కి ఆలౌట్ అయింది.

ఆస్ట్రేలియా ముందు 76 పరుగుల స్వల్ప లక్ష్యం ఉండ‌గా వారు దాన్ని సునాయాసంగానే ఛేదించారు. అయితే ఈ మ్యాచ్‌లో ఘోర ప‌రాజ‌యంతో అంద‌రూ రోహిత్ శ‌ర్మ‌ను నిందిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే రోహిత్ చేసిన ఒకే ఒక్క త‌ప్పు వ‌ల‌న ఇండియ‌న్ టీంకి ఇలాంటి ప‌రిస్థితి వ‌చ్చింద‌ని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. క్రికెట్ మ్యాచ్ కు ముందు ఆటగాళ్లు ముఖ్యంగా ఆలోచించేది పిచ్ గురించి, అనంత‌రం టాస్ గురించి. ఇక జట్టు కెప్టెన్ కు పిచ్ గురించి పూర్తి అవగాహన ఉంటే బ్యాటింగ్ తీసుకోవాలో లేదా బౌలింగ్ తీసుకోవాలో అని ముందే నిర్ణ‌యం తీసుకుంటారు. అయితే గ‌త రెండు టెస్ట్‌ల‌లో ఆసీస్ చేసిన త‌ప్పును ఇప్పుడు రోహిత్ చేశాడు.

IND Vs AUS these are the main reasons for India loss in 3rd test
IND Vs AUS

మొద‌టి రెండు టెస్ట్‌ల‌లో ఆసీస్ ముందు బ్యాటింగ్ చేయ‌డం వ‌ల‌నే ఓడిపోయింద‌ని, వాటిని చూసిన తర్వాత కూడా రోహిత్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడం ఏంటని అభిమానులు, క్రికెట్ మాజీలు ప్రశ్నిస్తున్నారు. అదే రోహిత్ బౌలింగ్ తీసుకుని ఉంటే ప‌రిస్థితి వేరేలా ఉండేద‌ని చెబుతున్నారు. అయితే ఆసీస్ బౌల‌ర్స్ చూపించిన ప్ర‌తిభను మ‌న బౌల‌ర్స్ పెద్ద‌గా చూపించ‌ లేదు. అలాగే టాస్ గెలిచి బౌలింగ్‌కు బ‌దులుగా ముందు బ్యాటింగ్ తీసుకోవ‌డం, నిర్ల‌క్ష్య‌పు షాట్స్ ఆడ‌డం.. వంటివ‌న్నీ టీమిండియా ఓట‌మికి కార‌ణ‌మ‌య్యాయ‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే ఇప్ప‌టికిప్పుడు వ‌చ్చే న‌ష్టం ఏమీ లేకున్నా.. మార్చి 9 నుంచి ప్రారంభం అయ్యే చివ‌రి టెస్టులో మాత్రం భార‌త్ నెగ్గాల్సిందే. క‌నీసం డ్రా అయినా చేసుకోవాలి. లేదంటే అటు టెస్ట్ చాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ కి చేరుకునే అవ‌కాశాలు స‌న్న‌గిల్లుతాయి. మ‌రి 4వ టెస్టులో గెలుస్తారా.. లేదా.. అన్న‌ది చూడాలి.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago