Thatikonda Rajaiah : టిక్కెట్టు దక్కకపోవడంతో స్టేషన్ ఘన్ పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అంబేద్కర్ విగ్రహం ముందు పడుకొని భావోద్వేగానికి గురయ్యారు.. స్టేషన్ ఘన్ పూర్ నుండి రాజయ్య స్థానంలో మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి కేసీఆర్ టిక్కెట్టు కేటాయించారు. కేసీఆర్ ప్రకటించిన జాబితాలో రాజయ్య స్థానంలో కడియం శ్రీహరికి బీఆర్ఎస్ నాయకత్వం టిక్కెట్టు కేటాయించింది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కూడ స్టేషన్ ఘన్ పూర్ నుండి టీడీపీ అభ్యర్ధిగా కడియం శ్రీహారి ప్రాతినిథ్యం వహించారు. గతంలో వీరిద్దరూ టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో కొనసాగారు. 2014 ఎన్నికలకు ముందు కడియం శ్రీహరి టీడీపీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. 2009 ఎన్నికల తర్వాత కొంత కాలానికే రాజయ్య బీఆర్ఎస్ లో చేరారు. 2014, 2018 ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ నుండి రాజయ్యకు కేసీఆర్ టిక్కెట్టు ఇచ్చారు.
2014లో కేసీఆర్ మంత్రివర్గంలో రాజయ్యకు డిప్యూటీ సీఎంగా అవకాశం కూడా దక్కింది. అయితే కొన్ని కారణాల వలన రాజయ్యను మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేసి అదే స్థానంలో కడియం శ్రీహరిని డిప్యూటీ సీఎంగా తీసుకున్నారు. అయితే 2018లో స్టేషన్ ఘన్ పూర్ నుండి పోటీకి కడియం శ్రీహరి ప్రయత్నించారు. కానీ కేసీఆర్ టిక్కెట్టు ఇవ్వలేదు. కడియం శ్రీహరికి ఎమ్మెల్సీ పదవిని పొడిగించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కడియం శ్రీహరి ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ నుండి కేసీఆర్ కడియం శ్రీహరికి అవకాశం కల్పించారు.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నుండి రాజయ్య 2014, 2018లో బీఆర్ఎస్ నుండి గెలిచారు. అయితే ఈసారి ఈ టిక్కెట్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి దక్కింది. తనకు టిక్కెట్ దక్కకపోవడంతో రాజయ్య కన్నీటిపర్యంతమయ్యారు. కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ… ఉన్నతస్థానం కల్పిస్తామని కేసీఆర్ తనకు చెప్పారన్నారు. ఇప్పుడు ఉన్న స్థానం కంటే మంచిస్థానం తనకు కల్పిస్తానని హామీ ఇచ్చారని, అధినేత మాటను గౌరవించి తాను ముందుకు సాగుతానన్నారు. కేసీఆర్ గీసిన గీతను తాను దాటేది లేదని, ఆయన ఆదేశాలు పాటిస్తానని స్పష్టం చేశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…