Chiranjeevi : ఈ రోజు మెగా అభిమానుల పండుగ అని చెప్పాలి. చిరంజీవి ఈ రోజు 68వ పడిలోకి అడుగుపెట్టడంతో ఆయన బర్త్ డే వేడుకలని ప్రతి ఒక్కరు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవికి తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ లేఖ పంచుకున్నారు. మీ తమ్ముడుగా పుట్టి మిమ్మల్ని అన్నయ్య అని పిలిచే అదృష్టాన్ని కలిగించిన ఆ భగవంతునికి ముందుగా థ్యాంక్స్ అంటూ తన సందేశాన్ని పోస్ట్ చేశారు పవన్ కళ్యాణ్. రామ్ చరణ్ షేర్ చేసిన పోస్ట్ కూడా అందరిని ఆకట్టుకుంది.
మా ప్రియాతి ప్రియమైన ‘చిరుత’ (చిరంజీవి తాత)కు ఆనందాల పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయనపై మా ప్రేమాభిమానాలకు అంతులేదు. కొణిదెల కుటుంబంలో ఇటీవల వచ్చిన బుజ్జాయి కూడా ఆయనపై ప్రేమ కురిపిస్తుంది” అంటూ రామ్ చరణ్ ఇన్ స్టాగ్రామ్ లో పేర్కొన్నారు. ఉపాసన కూడా ఇదే సందేశాన్ని పంచుకున్నారు. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్‌లో చిరంజీవి పుట్టినరోజు వేడుకలను అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. స్వయంకృషి, స్వీయ ప్రతిభే చిరంజీవి కెరీర్ కి పునాది రాళ్లు. అడుగడుగునా సవాళ్లను అధిగమించి చరిత్ర సృష్టించిన విజేత మన మెగాస్టార్ కాగా, ఆయనపై ప్రతి ఒక్కరు తమదైన స్టైల్‌లో ప్రేమని చాటుతున్నారు.
చిరంజీవి బర్త్ డే సందర్భంలో ఒక టీవీ ఛానల్ సాంగ్ విడుదల చేసింది.ఆ సాంగ్‌కి నెటిజన్స్ నుండి సూపర్భ్ రెస్పాన్స్ వస్తుంది. విడుదలైన కొన్ని గంటలలోనే ఆ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ దక్కింది. చిరునవ్వుల చిరుత.. గగనం నీ ఘనత అంటూ సాగే ఈ పాట ఇప్పుడు నెట్టింట దూసుకుపోతుంది. మెగా ఫ్యాన్స్‌ని కూడా ఈ సాంగ్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రతి ఒక్క మెగా అభిమాని కూడా తనదైన స్టైల్‌లో ఈ సాంగ్‌పై కామెంట్స్ పెడుతున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…