Suriya : మెగాస్టార్ చిరంజీవికి ఎల్లలు, హద్దులు లేవు. ఆయనకి తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశ వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ఉంది. చిరంజీవికి సినీ పరిశ్రమలో కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆయన గురించి చెప్పాలంటూ ఒక్క రోజు కూడా సరిపోదు. ఓ సారి తమిళ స్టార్ హీరో సూర్య తన సినిమా ప్రమోషన్ లో భాగంగా చిరంజీవి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. నేను ఆగరం ఫౌండేషన్‌ను స్థాపించాను. ఈరోజు నేను చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి అందరూ మాట్లాడుతున్నారు. కానీ నాకు స్వచ్ఛంద సంస్థను ప్రారంభించడానికి ఇన్‌స్పిరేషన్ ఇచచింది మాత్రం చిరంజీవిగారే. రక్తదానానికి సంబంధించిన కొన్ని లక్షల మందిలో ఆయన మార్పును తీసుకొచ్చారు. అందులో కొంతైనా నేను చేయాలనిపించి ఆగరం ఫౌండేషన్‌ను స్టార్ట్ చేశాను అని అన్నారు.
సినీ పరిశ్రమలో నాకు మెగాస్టార్ చిరంజీవి గారు స్ఫూర్తి. ఆయన బ్లడ్ బ్యాంక్ ద్వారా అందిస్తున్న సేవల గురించి తెలుసుకుని, నేను స్ఫూర్తి పొంది.. అగరం ఫౌండేషన్ ను స్థాపించి సేవలు అందిస్తున్నాను” అని సూర్య తెలిపారు. మా ఫౌండేషన్ నుంచి ఈరోజున 5వేల మంది తొలి తరం పిల్లలు కాలేజీకి వెళుతున్నారు. కంఫర్ట్ జోన్‌లో ఉండకూడదు. మనిషి అలా అనుకుంటే ఎదుగుదల ఉండదు. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చినప్పుడే మార్పు ఉంటుంది. మన హృదయం ఏది చెబితే అది చేయండి. దాని కోసం కష్టపడండి. కరోనా సమయంలో అందరూ తమ చుట్టూ ఉన్న వారికి సాయపడ్డారు. అలాగే ముందుకు వెళదాం. అందరికీ మంచి భవిష్యత్తు ఉంది’’ అన్నారు.
ఇక సూర్య హీరోగా కంగువా అనే చిత్రం రూపొందుతుండగా, ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా దర్శకుడు శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రంగా “కంగువా” రూపొందుతుంది.. ఈ చిత్రం కోసం అయితే మళ్లీ సూర్య చాన్నాళ్ల తర్వాత తనదైన మెకోవర్ ని రెడి చేస్తున్నాడు. సూర్య చాలా కాలం తర్వాత తన బీస్ట్ మోడ్ ని కనబరుస్తున్నాడని ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అయిపోయారు. ఇక ఈ భారీ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా గ్రీన్ స్టూడియోస్ వారు అలాగే యూవీ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని మేకర్స్ వరల్డ్ వైడ్ 10 భాషల్లో 3డి లో రిలీజ్ చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…