Teja : సినిమా పరిశ్రమలో అవకాశాలు పొందడం అంత ఈజీ కాదు. ఒక్క సినిమా ఛాన్స్ దక్కించుకోవడానికి నటీనటులు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు . అయితే సాధారణంగా సినిమాలలో ఎక్కువగా ఫేమస్ ఆర్టిస్ట్‌లే కనిపిస్తారు. కొత్త వారిని పరిచయం చేసేందుకు దర్శకులు అంత పెద్దగా ఆసక్తి చూపరు. కాని తన సినీ కెరియర్లో మొత్తం 1163 మందిని తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేశానని దర్శకుడు తేజ వెల్లడించారు. నటీనటులు, హీరో హీరోయిన్లు ఇతర టెక్నీషియన్లు అందరినీ లెక్క వేస్తే 1163 మందిని తాను ఇంట్రడ్యూస్ చేశానని ఆయన అన్నారు.
అయితే వీరిలో ఎంతమందికి కృతజ్ఞతా భావం ఉంటుందని ప్రశ్నించగా, ఒక 20 మంది లోపే ఆ భావం ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా కమెడియన్ సుమన్ శెట్టి గురించి ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సుమన్ శెట్టి సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన కొత్తలో తాను వచ్చిన డబ్బుతో ఒక స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకోమని సలహా ఇచ్చానని అతను నేను చెప్పిన మాట విన్నాడని తేజ అన్నారు. అయితే ఇల్లు కట్టుకున్న తర్వాత నా కాళ్లు పట్టుకొని ఆశీర్వాదం తీసుకుంటానని సునీల్ అన్నాడు. అయితే కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం లేదని అన్నానని చెప్పుకొచ్చారు.
అయితే మీ రుణం ఏదో ఒక విధంగా తీర్చుకునే అవకాశం కల్పించాలని సుమన్ శెట్టి ప్రాధేయ పడటంతో అప్పుడు నేను ఇలాగే కొత్తవారితో సినిమాలు చేస్తూ ఉండడం వలన, ఒకానొక రోజున అన్ని పోగొట్టుకుని రోడ్డున పడితే నాకు ఉండటానికి ఒక రూమ్ ఉంచు. రోడ్డు మీద పడ్డాక ఎటు వెళ్లాలో తెలియక మీ ఇంటికి వస్తాను” అని సునీల్ శెట్టితో తేజ అన్నాడట. తేజ మాటలు విన్న అతను తన ఇంట్లో ఓ రూమ్ ను సైతం కట్టాడట . ఇప్పటికీ ఆ రూమ్ ను శుభ్రం చేస్తూ అలాగే ఆ రూమ్ లో తన ఫోటో కూడా పెట్టుకున్నాడని డైరెక్టర్ తేజ ఈ ఇంటర్వ్యూలో చెప్పాడు. ప్రస్తుతం తేజ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…