Tea And Coffee : మనలో చాలామందికి ఉదయం నిద్రలేచిన తర్వాత ఒక కప్పు టీ లేదా కాఫీని తాగనిదే అస్సలు బుర్ర పనిచేయదు. ఉదయాన్నే ఛాయ్ లేదా కాఫీని సేవించడం వల్ల ఆ రోజును ఫ్రెష్‌గా ప్రారంభించడానికి వీలుంటుందనేది చాలా మంది ఫీలింగ్. అయితే తెనీరు వల్ల ఫ్రెష్ ఫీలింగ్ మాత్రమే కాకుండా వాటి వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి. టీ లేదా కాఫీలు పరిమిత మోతాదులో తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదే. కానీ ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోకూడదనేది అతి ముఖ్యం. పరగడుపున ఎట్టి పరిస్థితుల్లోనూ టీ, కాఫీలు సేవించకూడదు.
వాస్తవానికి పరగడుపున టీ, కాఫీలు సేవించడం వల్లన రోజంతా అలసటగా ఉంటుందట. అదే సమయంలో మానసికంగా ఒత్తిడి, చికాకు ఉంటాయి. అంతేకాదు పరగడుపు టీ, కాఫీల కారణంగా వికారం ఉంటుంది. గ్యాస్ట్రిక్ సమస్య వెంటాడుతుంది. నరాల సమస్య ఉంటుంది. పరగడుపున టీ, కాఫీలు తీసుకుంటే.. కడుపులో ఉంటే గుడ్ బ్యాక్టీరియా దెబ్బ తింటుంది. ఫలితంగా ఇది జీర్ణ వ్యవస్థపై అధిక ప్రభావం చూపిస్తుంది. అంతేకాదు..యూరిన్ ఇన్‌ఫెక్షన్ కొత్త సమస్యగా మారుతుంది. ఎందుకంటే శరీరంలో నీరు లేకపోవడం, డీ హైడ్రేషన్ కారణంగా ఇది జరుగుతుంది.
ఉదయం వేళల్లో పరగడుపున టీ, కాఫీలు తీసుకుంటే.. ఎసిడిటీ, నోటి దుర్వాసన కూడా ఉంటాయి. అందుకే ఉదయం వేళల్లో టీ, కాఫీలు తీసుకోవడం మానేయడం మంచిది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తరువాత ఒకసారి, సాయంత్రం వేళల్లో స్నాక్స్‌తో పాటు మరోసారి తీసుకుంటే చాలు. ఇలా ఓ క్రమబద్ధంగా టీ, కాఫీ అలవాటు చేసుకుంటే ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు తలెత్తవు. ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం ద్వారా కెఫీన్ తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ కణాలను ఉత్తేజపరుస్తుంది. ఇది తీవ్రమైన గుండెల్లో మంట మరియు యాసిడ్ రిఫ్లేక్స్ కు దారి తీస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…