Nandamuri Suhasini : ఈ ఏడాది చివరలో తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువదీరనుంది. ఏ ప్రభుత్వం వస్తుందా అని ప్రతి ఒక్కరు ఆశగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో తెలుగుదేశం పార్టీ ఉంటుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ 87 స్థానాల్లో పోటీకి రెడీ అయిందని, ఈ ఎన్నికలను టిడిపి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని, జనసేనతో పొత్తు విషయం పైన ఆలోచిస్తుందని కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించగా, ఇప్పుడు ఈ ఎన్నికలపై అందరిలో ఆసక్తి నెలకొంది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీకి అభిమానులు ఉన్న నేపథ్యంలో కొన్ని సీట్లు అయినా టిడిపి తన ఖాతాలో వేసుకుంటుంది అని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది.
క్షేత్రస్థాయిలో టిడిపికి ప్రజలలో బలం ఉందని, తమ ఓటు బ్యాంకు నుండి నష్టపోకుండా ఉండడం కోసం ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సారి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని స్థానాలైన గట్టిగా సాధించాలని పట్టుదలతో ఉన్న టిడిపి నందమూరి కుటుంబానికి చెందిన ఆడపడుచును రంగంలోకి దించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. 2018 ఎన్నికలలో తొలిసారి నందమూరి కుటుంబం నుంచి నందమూరి సుహాసిని ఎన్నికల బరిలోకి దిగారు. కూకట్పల్లి నియోజకవర్గం నుంచి సుహాసిని పోటీ చేశారు. అప్పట్లో కాంగ్రెస్ తో పొత్తుల లో భాగంగా పోటీ చేసిన నేపథ్యంలో ఆమె గెలుస్తుంది అని అంతా భావించారు. నందమూరి బాలకృష్ణ వంటి వారి ప్రచారం చేయడం కూడా కలిసి వస్తుందని నమ్మారు. ఊహించని విధంగా సుహాసిని ఓటమిపాలయ్యారు.
ఇప్పుడు సుహాసిని మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి టిడిపి నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. అయితే ఈసారి నందమూరి సుహాసిని ఎల్బీనగర్ నియోజకవర్గం, కూకట్పల్లి నియోజకవర్గం నుండి.. రెండు చోట్ల నుండి పోటీ చేస్తారని తెలుస్తుంది. ఈసారి సుహాసినిని గెలిపించుకోవడం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. సెటిలర్లు ఎక్కువగా ఉండే ఎల్బీనగర్ తో పాటు కూకట్పల్లి సీటును సుహాసినికి కేటాయించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికలలో ఎల్బీ నగర్ నుండి బీసీ నాయకుడు ఆర్.కృష్ణయ్య విజయం సాధించగా, ఆయన జోరుని బీఆర్ఎస్ అడ్డుకోలేకపోయింది. ఈ క్రమంలోనే సుహాసినిని రంగంలోకి దించి సత్తా చాటాలని ప్లాన్ చేస్తుఉన్నట్టు సమాచారం.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…