69వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఢిల్లీ వేదికగా అత్యంత ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో టాలీవుడ్ ప్రముఖ హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి విజేతలు హాజరు కాగా, జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన టాలీవుడ్ ప్రముఖ హీరో అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన, దర్శకుడు బుచ్చిబాబు సాన, నిర్మాతలు రవిశంకర్ ఎర్నేని, ఎలమంచిలి రవిశంకర్ అవార్డులు స్వీకరించారు.ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను దర్శకుడు రాజమౌళి, ది కాశ్మీర్ ఫైల్స్ చిన్న సినిమాకు నిర్మాత అభిషేక్ అగర్వాల్ అవార్డులు దక్కాయి.
అయితే జాతీయ అవార్డ్‌లని మొదటి సారి 1954లో అందించారు. భారతీయ కళలు మరియు సంస్కృతిని కలిగి ఉన్న సినిమాలకు, దేశీయ వ్యక్తులు దర్శకత్వం వహించిన సినిమాలను గౌరవించడానికి మరియు వారిని ప్రోత్సహించేందుకు ఈ అవార్డ్‌లని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 1973 నుండి ఈ అవార్డు వేడుకలు భారత ప్రభుత్వ డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ద్వారా నిర్వహించబడడం జరుగుతుంది.నేషనల్ అవార్డ్స్‌ని ఢిల్లీలో రాష్ట్రపతి ప్రధానం చేస్తారు. జాతీయ చలనచిత్ర అవార్డులు రెండు ప్రధాన విభాగాలగా ఉన్నాయి. ఫీచర్ ఫిల్మ్‌లు మరియు నాన్-ఫీచర్ ఫిల్మ్‌లు. ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ కింద విజేతలను 13 మంది సభ్యులతో కూడిన జ్యూరీ ఎంపిక చేస్తుంది.
నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో విజేతలను 5 మంది సభ్యులతో కూడిన జ్యూరీ ఎంపిక చేస్తుండగా, అందుకు ఏయే నియమాలని పాటిస్తారనేది ఇప్పుడు చూద్దాం. ఎంట్రీకి పంపించే సినిమా జనవరి 1 నుంచి డిసెంబర్ 31 లోపు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ద్వారా సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది. అప్పుడే ఈ పోటీలో పాల్గొనే అర్హత ఉంటుంది. ఈ పోటీలోకి వచ్చే సినిమాలు ఇండియాలోనే నిర్మించి ఉండాలి. ఈ సినిమాకు విదేశీ సంస్థ సహ-నిర్మాతగా ఉంటే, మరో 6 షరతులను నెరవేర్చాల్సి ఉంటుంది. అన్ని షరతులను పూర్తి చేసిన తర్వాత, సినిమా ఎంట్రీ లిస్ట్ కి అర్హత దక్కించుకుంటుంది. ఇక పోటీలో పాల్గొనే సినిమాకి తప్పక భారతీయుడు మాత్రమే దర్శకత్వం వహించాల్సి ఉంటుంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకొనే నేషనల్ అవార్డ్స్‌ని ప్రకటిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…