Ravinder Chandrashekharan : కోలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటి మహాలక్ష్మి భర్త రవీందర్ చంద్రశేఖరన్ పేరు ఇటీవల సోషల్ మీడియాలో తెగ మారుమ్రోగిపోతుంది. అతను గతేడాది ప్రముఖ టీవీ నటి మహాలక్ష్మితో కలిసి పెళ్లిపీటలెక్కారు. అయితే ఈ పెళ్లి అయినప్పటినుంచి మహాలక్ష్మి, రవీందర్‌ల పేర్లు సోషల్ మీడియాలో మార్మోగుతున్నాయి. కొందరు నెటిజన్లు రవీందర్‌ను బాడీ షేమింగ్ చేస్తూ నెట్టింట పోస్టులు షేర్ చేశారు. అలాగే డబ్బు కోసమే మహాలక్ష్మి చంద్రశేఖరన్‌ను వివాహం చేసుకుందంటూ విమర్శలు గుప్పించారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసిన కూడా వారిద్దరు మాత్రం అవేమి పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. రవీందర్ చంద్రశేఖరన్ ఒక వ్యక్తిని మోసం చేసినటువంటి కేసులో భాగంగా అరెస్టు అయిన సంగతి మనకు తెలిసిందే.
ఒక ప్రాజెక్టు నిమిత్తం వేరే వ్యక్తి వద్ద కోళ్లల్లో డబ్బు తీసుకొని మోసం చేశారు అంటూ చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో మహాలక్ష్మీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన స్టైలిష్ ఫోటోలను షేర్ చేసింది. అయితే ఆమెపై కొందరు ట్రోల్ చేశారు. ఇదివరకే పెళ్లి చేసుకొని ఓ వ్యక్తి చేతిలో మోసపోయాను.తిరిగి రవీందర్ ను తాను పెళ్లి చేసుకున్నానని అయితే మరోసారి కూడా మోసపోయాను అంటూ ఈమె ఆవేదన వ్యక్తం చేశారని ఈమె సన్నిహితులు తెలియజేస్తున్నారు.పెళ్లికి ముందు ఇలాంటి విషయాల గురించి రవీందర్ నాకు చెప్పకుండా నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నారని ఈమె సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేశారట.
కొన్ని రోజులు జైలలో ఉన్న తర్వాత బయటకు వచ్చిన రవీందర్ తనకు మహాలక్ష్మీ ముఖ్యమని, మా అమ్మ తర్వాత అమ్మ మాదిరిగా ఆమె నాకు ముఖ్యమని పేర్కొన్నాడు. తమను ట్రోల్ చేస్తారేమో కాని ఎవరు విడదీయలేరంటూ మీడియా ముందుకు వచ్చి కన్నీరు పెట్టుకున్నాడు. ఇక వీరిద్దరికీ ఇది రెండవ వివాహం అనే సంగతి మనకు తెలిసిందే.కొద్ది రోజుల క్రితం ఈ జంట మొదటి వివాహ వార్షికోత్సవ వేడుక ను కూడా సెలబ్రేట్ చేసుకున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…