Rohit Sharma : రోహిత్ శ‌ర్మ బ్యాట్‌లో స్ప్రింగులు ఉన్నాయా.. అనుమానం వ్య‌క్తం చేసిన అంపైర్

Rohit Sharma : హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ బ్యాటింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అల‌వోక‌గా సిక్స‌ర్స్ బాదుతూ ప్ర‌త్య‌ర్ధుల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తుంటాడు. రోహిత్ క్రీజులో పాతుకుపోయాడంటే ప‌రుగుల వ‌ర‌ద పార‌డం ఖాయం. వ‌ర‌ల్డ్ క‌ప్‌కి ముందు పెద్ద‌గా రాణించ‌ని రోహిత్ శ‌ర్మ ఇప్పుడు మాత్రం మంచి ఫామ్‌లో ఉన్నాడు. ప్ర‌తి మ్యాచ్‌లోను మంచి స్టార్టింగ్ అందిస్తున్నాడు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్​ హైలైట్ అనే చెప్పాలి. ఆ మ్యాచ్‌లో పాక్‌ని త‌క్కువ ప‌రుగులకే క‌ట్ట‌డి చేసిన కూడా బాల్ బ్యాట్​ మీదకు సరిగ్గా రాకపోవడం, పిచ్ రివర్స్ స్వింగ్, స్పిన్​కు అనుకూలిస్తుండటంతో భారత్ ఛేజింగ్ కష్టమేనని అనిపించింది.

ఆసీస్​తో మ్యాచ్​లోలా ఆరంభంలో వికెట్లు పడితే టీమిండియా పరిస్థితి ఏంటనే అనుమానం అంద‌రిలో త‌లెత్త‌గా, రోహిత్ శ‌ర్మ వాట‌న్నింటిని ప‌టాపంచ‌లు చేశాడు. తాను ఫామ్​లో ఉంటే ఏ విషయాలు లెక్కలోకి రావని ప్రూవ్ చేశాడు. క్రీజులో ఉన్నంత సేపు ఫోర్లు, సిక్సులతో పాక్ బౌలర్లను ఊచ‌కోత కోసాడు. తన టీమ్ ఇలాగే అటాకింగ్ గేమ్​తోనే వరల్డ్ కప్​ ప్రయాణాన్ని కొనసాగిస్తుందని ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపాడు. పాక్ బ్యాటర్లు షాట్లు కొట్టలేక చేతులెత్తేసిన పిచ్​ మీద రోహిత్ నీళ్లు తాగినంత ఈజీగా బౌండరీలు, సిక్సులు బాదడంతో అందరూ షాకయ్యారు. ఆఖరికి మ్యాచ్ అంపైర్​కు కూడా రోహిత్​ బ్యాటింగ్​పై అనుమానం వచ్చింది. దీంతో ‘నీ బ్యాట్​లో​ ఏదైనా ఉందా?’ అని హిట్​మ్యాన్​ను అంపైర్ ఎరాస్మస్ అడిగాడు. అయితే ‘బ్యాటులో కాదు.. ఇది నా పవర్’ అంటూ కండల్ని చూపించాడు రోహిత్. ఈ విషయాన్ని మ్యాచ్ తర్వాత హార్దిక్ పాండ్యాతో మాట్లాడుతూ టీమిండియా కెప్టెన్ రివీల్ చేశాడు.

springs in Rohit Sharma bats umpire doubtful
Rohit Sharma

రోహిత్ ఈజీగా సిక్సులు కొట్టడం వెనుక అతడి పవర్​తో పాటు పర్ఫెక్ట్ టైమింగ్ కూడా ఒక కారణమని క్రికెట్ అనలిస్టులు చెప్పుకొస్తున్నారు.. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా పాకిస్థాన్ శనివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మెగా టోర్నీలో పాకిస్థాన్‌పై తమ ఆధిపత్యాన్ని 8-0కు పెంచుకొని అష్ట దిగ్భంధం చేసింది. రోహిత్ శర్మ(63 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 86) విధ్వంసకర బ్యాటింగ్‌తో టీమిండియా విజయం సులువైంది. డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్, వైడ్ లాంగాన్, మిడాన్, కవర్స్, స్క్వేర్ లెగ్, డీప్ మిడ్ వికెట్.. దిశల్లో రోహిత్ శర్మ బాదిన సిక్స్‌లు ఆకట్టుకున్నాయి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago