Allu Arjun : 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఢిల్లీ వేదికగా అత్యంత ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో టాలీవుడ్ ప్రముఖ హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి విజేతలు హాజరు కాగా, జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన టాలీవుడ్ ప్రముఖ హీరో అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమానికి హాజరై సందడి చేశారు.ఢిల్లీలో జరిగిన 69వ జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో అల్లు అర్జున్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు. అనంతరం తన స్పందనను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
జాతీయ అవార్డు అందుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని అల్లు అర్జున్ తెలిపారు. “ఈ పురస్కారంతో నన్ను గుర్తించినందుకు ఈ సందర్భంగా నేను సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖకు, జాతీయ అవార్డుల జ్యూరీకి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ అవార్డు ఓ వ్యక్తిగత మైలురాయి మాత్రమే కాదు… సినిమాను ఆదరించి, మద్దతు తెలిపిన వారందరికీ ఇది చెందుతుంది. థాంక్యూ సుకుమార్ గారూ… నేను ఈ ఘనత సాధించడానికి మీరే కారణం” అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు అల్లు అర్జున్. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.
ఇక జాతీయ అవార్డ్‌ల కార్యక్రమంలో టాలీవుడ్ సందడి ఎక్కువగా కనిపించింది. ఆర్ఆర్ఆర్ బృందానికి కూడా అవార్డులు రావడంతో కార్యక్రమంలో కోలాహలం నెలకొంది. పుష్ప చిత్రానికి గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ అవార్డును స్వీకరించగా, ఆర్ఆర్ఆర్ చిత్రానికి గాను ఉత్తమ పాప్యులర్ ఫిల్మ్ అవార్డును రాజమౌళి అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఉత్తమ నేపథ్య సంగీతం అందించినందుకు ఎంఎం కీరవాణి, బెస్ట్ సింగర్ గా కాలభైరవ (ఆర్ఆర్ఆర్ లో కొమురంభీముడో పాటకు), ఉత్తమ కొరియోగ్రాఫర్ గా ప్రేమ్ రక్షిత్ (ఆర్ఆర్ఆర్) కూడా రాష్ట్రపతి నుంచి అవార్డులు అందుకున్నారు. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం కేటగిరీలో ‘ఉప్పెన’ చిత్రానికి గాను దర్శకుడు సానా బుచ్చిబాబు, నిర్మాత నవీన్ యెర్నేని అవార్డును స్వీకరించారు. ఉత్తమ గీత రచయిగా చంద్రబోస్ (ఆర్ఆర్ఆర్), ఉతమ్ స్టంట్ కొరియోగ్రాఫర్ గా కింగ్ సోలోమన్ (ఆర్ఆర్ఆర్), ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ కు గాను శ్రీనివాస్ మోహన్ (ఆర్ఆర్ఆర్) కూడా అవార్డులు అందుకున్నవారిలో ఉన్నారు. తెలుగు వాళ్ల హవా ఈ సారి ఎక్కువగా కనిపించడంతో బాలీవుడ్ ఆశ్చర్యానికి గురైంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…