CM Jagan : బెంగ‌ళూరులో సీఎం జ‌గ‌న్ 23 ఎక‌రాల బంగ్లా.. ఎంత అందంగా ఉంది..!

CM Jagan:ఏపీ ముఖ్య‌మంత్రి సీఎం జ‌గ‌న్ కి చాలా ఆస్తులు ఉన్నా కూడా సింపుల్‌గా ఉంటారు. ఆయన ఆస్తుల విలువ రూ.510 కోట్లుగా ఉంది. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. అంతేకాదు.. ఇప్పుడున్న 30 మంది ముఖ్యమంత్రుల్లో.. 29 మంది కోటీశ్వరులేనని.. వీరిలో జ‌గ‌న్‌ టాప్‌లో ఉండగా.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆఖర్లో ఉన్న‌ట్టు కొన్నాళ్ల క్రితం ఏడీఆర్, ఎన్ఈడబ్ల్యూ వెల్లడించింది. జ‌గ‌న్‌కి చాలా ఆస్తులు ఉన్న‌ట్టు తెలుస్తుండ‌గా, బెంగ‌ళూరులో ఏకంగా 23 ఎక‌రాల బంగ్లా ఉన్న‌ట్టు తెలుస్తుంది. ఆ బంగ్లా చాలా పెద్ద‌దిగా ఎంతో సువిశాలంగా ఉంటుంది. ఇంద్ర భవ‌నం మాదిరిగా ఉన్న బంగ్లాని చూసి ప్ర‌తి ఒక్క‌రు థ్రిల్ అవుతున్నారు.

అక్రమాస్తుల కేసులో వైఎస్. జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్లి తరువాత బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటు తెలుగుదేశం పార్టీకి సినిమా చూపించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. పార్టీ స్థాపించిన కొద్ది సంవత్సరాల్లోనే వైఎస్. జగన్ ఆంధ్రప్రదేశ్ సీఎం అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్- తెలంగాణ విభజన తరువాత మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేసిన నారా చంద్రబాబు నాయుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆస్తుల వివరాలు కొద్ది రోజుల క్రితం బ‌య‌ట‌కు రాగా, ఆ విష‌యాలు హాట్ టాపిక్‌గా మారాయి.

జగన్ ఆస్తుల విలువ కొన్ని వేల కోట్లు ఉంటుందని టీడీపీ నేతలు ఎప్పటినుండో ఆరోపణలు చేస్తున్నారు.. 2004లో వైఎస్ ముఖ్యమంత్రిగా అధికారం దక్కించుకునే నాటికి, ఆ తర్వాత 2008కే జగన్ ఆస్తుల విలువ కొన్ని వందల రెట్లు పెరిగింది.. అంతేకాదు, జగన్ ఆస్తులు, నాటి అంశాలపై ఓ టాప్ ఎనలిస్ట్, మాజీ ఐఏఎస్ అధికారి ఓ అంశాన్ని గుర్తు చేసిన ఘటన.. ఇప్పటికీ మీడియాలో హైలైట్ అవుతూనే ఉంటుంది.. వైఎస్ ఇంటికి గతంలో ల్యాండ్ లైన్ ఫోన్ కోసం రికమండేషన్ కావాలని అడిగారట.. కానీ, నేడు కొన్ని వందల కోట్లు అధికారికంగా జగన్ పేరిట దఖలు పడ్డాయి..బెంగళూరులోని అలహంకలో సుమారు 20 ఎకరాల్లో ఒక ప్యాలెస్, హైదరాబాద్ లో లోటస్ పాండ్ లో మరో రాజప్రసాదం, ఇటు తాడేపల్లిలో మరో భారీ భవంతి, ఇక పులివెందుల ఇడుపాయలలో భారీ ఎస్టేట్.. బహిరంగంగా కనిపిస్తోన్న జగన్ ఆస్తులు ఇవి.. ఇక ఆయన కంపెనీల విలువ చూస్తే కోటానుకోట్లు ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.. పవర్ ప్రాజెక్ట్ లు, సిమెంట్ ఫ్యాక్టరీలు, పేపర్ సంస్థలు, మీడియా హౌజ్ లు, మైనింగ్ ఇండస్ట్రీలు.. వందల ఎకరాల భూములు, ఇలా చెప్పుకుంటూ పోతే…. జగన్ ఆస్తుల విలువ ఎన్ని వేల కోట్లు ఉంటుందనేది ఊహకందని విషయం అంటారు ఎనలిస్టులు..

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago