Rohit Sharma : హిట్ మ్యాన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలవోకగా సిక్సర్స్ బాదుతూ ప్రత్యర్ధుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తుంటాడు. రోహిత్ క్రీజులో పాతుకుపోయాడంటే పరుగుల వరద పారడం ఖాయం. వరల్డ్ కప్‌కి ముందు పెద్దగా రాణించని రోహిత్ శర్మ ఇప్పుడు మాత్రం మంచి ఫామ్‌లో ఉన్నాడు. ప్రతి మ్యాచ్‌లోను మంచి స్టార్టింగ్ అందిస్తున్నాడు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ హైలైట్ అనే చెప్పాలి. ఆ మ్యాచ్‌లో పాక్‌ని తక్కువ పరుగులకే కట్టడి చేసిన కూడా బాల్ బ్యాట్ మీదకు సరిగ్గా రాకపోవడం, పిచ్ రివర్స్ స్వింగ్, స్పిన్‌కు అనుకూలిస్తుండటంతో భారత్ ఛేజింగ్ కష్టమేనని అనిపించింది.
ఆసీస్‌తో మ్యాచ్‌లోలా ఆరంభంలో వికెట్లు పడితే టీమిండియా పరిస్థితి ఏంటనే అనుమానం అందరిలో తలెత్తగా, రోహిత్ శర్మ వాటన్నింటిని పటాపంచలు చేశాడు. తాను ఫామ్‌లో ఉంటే ఏ విషయాలు లెక్కలోకి రావని ప్రూవ్ చేశాడు. క్రీజులో ఉన్నంత సేపు ఫోర్లు, సిక్సులతో పాక్ బౌలర్లను ఊచకోత కోసాడు. తన టీమ్ ఇలాగే అటాకింగ్ గేమ్‌తోనే వరల్డ్ కప్ ప్రయాణాన్ని కొనసాగిస్తుందని ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపాడు. పాక్ బ్యాటర్లు షాట్లు కొట్టలేక చేతులెత్తేసిన పిచ్ మీద రోహిత్ నీళ్లు తాగినంత ఈజీగా బౌండరీలు, సిక్సులు బాదడంతో అందరూ షాకయ్యారు. ఆఖరికి మ్యాచ్ అంపైర్‌కు కూడా రోహిత్ బ్యాటింగ్‌పై అనుమానం వచ్చింది. దీంతో ‘నీ బ్యాట్‌లో ఏదైనా ఉందా?’ అని హిట్‌మ్యాన్‌ను అంపైర్ ఎరాస్మస్ అడిగాడు. అయితే ‘బ్యాటులో కాదు.. ఇది నా పవర్’ అంటూ కండల్ని చూపించాడు రోహిత్. ఈ విషయాన్ని మ్యాచ్ తర్వాత హార్దిక్ పాండ్యాతో మాట్లాడుతూ టీమిండియా కెప్టెన్ రివీల్ చేశాడు.
రోహిత్ ఈజీగా సిక్సులు కొట్టడం వెనుక అతడి పవర్‌తో పాటు పర్ఫెక్ట్ టైమింగ్ కూడా ఒక కారణమని క్రికెట్ అనలిస్టులు చెప్పుకొస్తున్నారు.. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా పాకిస్థాన్ శనివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మెగా టోర్నీలో పాకిస్థాన్‌పై తమ ఆధిపత్యాన్ని 8-0కు పెంచుకొని అష్ట దిగ్భంధం చేసింది. రోహిత్ శర్మ(63 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 86) విధ్వంసకర బ్యాటింగ్‌తో టీమిండియా విజయం సులువైంది. డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్, వైడ్ లాంగాన్, మిడాన్, కవర్స్, స్క్వేర్ లెగ్, డీప్ మిడ్ వికెట్.. దిశల్లో రోహిత్ శర్మ బాదిన సిక్స్‌లు ఆకట్టుకున్నాయి.