Tamannaah : హ్యాపీడేస్ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ తమన్నా. మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటునే.. సోషల్ మీడియాలో పిక్స్, వీడియోలతో ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తోంది. గత దశాబ్దం కాలంలో గ్లామర్ డాన్స్ పరంగా కుర్రాళ్లల్లో తమన్నాకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి దక్కలేదు. టాలీవుడ్ వెండితెరని తన గ్లామర్ తో తమన్నా ఒక ఊపు ఊపింది. మిల్కీ అందాలతో తమన్నా సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే మైమరచిపోయే అభిమానులు ఉన్నారు. టాలీవుడ్ టాప్ హీరోల అందరి సరసన ఆడిపాడి మెప్పించింది తమ్మూ.
ప్రభాస్, పవన్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్ ఇలా క్రేజీ హీరోలందరితో మిల్కీ బ్యూటీ నటించింది. ప్రస్తుతం తమన్నా వయసు 32 ఏళ్ళు. ఈ అమ్మడు త్వరలో పెళ్లి చేసుకోబోతుందని కొద్ది రోజులుగా తెగ ప్రచారాలు నడుస్తున్నాయి. తమన్నా పాక్ క్రికెటర్ తో లవ్ ఎఫైర్ నడిపిస్తుందని టాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే అలా వార్తలు రావడానికి కూడా ఒక కారణం ఓ షోరూం ఓపెనింగ్ లో ఇద్దరు కలిసి ఫొటోలు దిగడం. ఈ పిక్ షేర్ చేస్తూ వారిద్దరు ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని పుకార్లు పట్టించారు.
అయితే ఈ ఫోటోలకు సంబంధించి అబ్దుల్ రజాక్ ఎ సారి సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చారు. తాము ఓ షాప్ ఓపెనింగ్ లో భాగంగా మాత్రమే ఫోటోలు దిగామని చెప్పారు. కాగా,ఇటీవల తమన్నా త్వరలోనే పెళ్లి చేసుకుని పిల్లల్ని కూడా కనాలనుకుంటున్నా అంటూ తమన్నా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పేసింది . కెరీర్ జోరు తగ్గుతుండడంతో పెళ్లి గురించి తమన్నాలో ఆలోచనలు మొదలయ్యాయి. ఇండియాలో అందరి కుటుంబాల లాగే మా ఫ్యామిలీ లో కూడా నా పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. నేను పెళ్ళికి వ్యతిరేకం కాదు. బిజీగా ఉండటం వల్ల ఇప్పటి వరకు పెళ్లి గురించి పట్టించుకోలేదు అని ఇటీవల చెప్పుకొచ్చింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…