Kantara Movie : అల్లు అర‌వింద్ ల‌క్ మామూలుగా లేదుగా.. పావలా పెట్టి కొంటే.. రూ.10 లాభం..

Kantara Movie : మెగా నిర్మాత అల్లు అర‌వింద్ అదృష్టం ఇటీవ‌లి కాలంలో మాములుగా లేదు.ఏది చేసిన కూడా ఆయ‌న‌ను అదృష్టం వ‌రిస్తూనే ఉంది. ఆహాని మొద‌లు పెట్టి లాభాల బాట‌లో ప‌య‌నిస్తున్నాడు అర‌వింద్. మ‌రోవైపు ఆయ‌న త‌న‌యుడు అల్లు అర్జున్ కూడా మంచి స‌క్సెస్ లు సాధిస్తూ భారీగా రెమ్యున‌రేష‌న్ అందుకుంటున్నాడు. ఈ క్ర‌మంలో అల్లు స్టూడియో ఒక‌టి ఇటీవ‌ల ప్రారంభించారు. అయితే రీసెంట్‌గా అర‌వింద్ క‌న్న‌డ సినిమా తెలగు థియేట్రిక‌ల్ రైట్స్ కొనుగోలు చేశారు. రూ.2 కోట్లకు అనువాద హక్కులను కొనుగోలు చేసినట్టు సమాచారం. గీతా ఫిలింస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా శనివారం ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

ఈ సినిమాకి అర‌వింద్ పెద్ద‌గా ఖ‌ర్చు పెట్టింది లేదు. ఎలాంటి ప్ర‌మోష‌న్స్ చేయ‌లేదు. అయిప్ప‌టికీ, తొలిరోజే రూ.2.1 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. అంటే ఒక్కరోజులోనే రావాల్సిన మొత్తాన్ని లాగేసింది. ఇక ఈరోజు ఆదివారం కావడంతో మరో రూ.2 కోట్ల షేర్ వచ్చే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్ రూ. 5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సెకండ్ డే ఓపెనింగ్ డేకి మించి వసూళ్లు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఫుల్ రన్ లో కాంతార రూ. 10 కోట్లకు పైగా షేర్ వసూలు చేయవచ్చనేది ట్రేడ్ వర్గాల అంచనా. మొత్తంగా అల్లు అరవింద్ డబ్బింగ్ మూవీతో పెట్టుబడికి ఐదారు రెట్ల లాభం పొందనున్నారు.

Allu Aravind hit jackpot with Kantara Movie
Kantara Movie

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీలోనూ ‘కాంతార’ కలెక్షన్స్ ఆకట్టుకుంటున్నాయి. హిందీ వెర్షన్ శుక్రవారం విడుదలైంది. తొలిరోజు ఈ సినిమా నార్త్‌లో రూ.1.3 కోట్లకు పైగా నెట్ వసూలు చేసింది. నిజానికి నార్త్‌లో ‘కాంతార’కు పెద్దగా థియేటర్లు ఇవ్వలేదట. తొలిరోజు మంచి కలెక్షన్లు రావడంతో థియేటర్ల సంఖ్యను పెంచారు. దీంతో శనివారం హిందీ వెర్షన్ కలెక్షన్స్ అనూహ్యంగా పెరిగాయి. రెండో రోజు హిందీలో ‘కాంతార’ సుమారుగా రూ.2.25 కోట్ల నెట్ వసూలు చేసింది. అంటే, హిందీలోనూ ఈ సినిమా రెండు రోజుల్లో సుమారు రూ.3.5 కోట్లు రాబట్టింది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago