Garlic : ఉదయాన్నే పరగడుపున ఒక వెల్లుల్లి రెబ్బను తింటుంటే శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఉదయాన్నే వెల్లుల్లిని తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా. వెల్లుల్లిలో అల్లిసిన్ ఉంటుంది. అందువల్ల వాటిని తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. హైబ్లడ్ ప్రెజర్ తో బాధపడే వారికి వెల్లుల్లి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఉదయాన్నే పరగడుపున ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకోవడం వల్ల హైబీపీ తగ్గుతుంది.
వెల్లుల్లిని ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు తగ్గుతాయి. వెల్లుల్లి రెబ్బలను తింటుంటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా నివారించవచ్చు. పచ్చి వెల్లుల్లి రెబ్బలని ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం వల్ల వివిధ రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలను తగ్గించవచ్చు. వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది.
వెల్లుల్లిని పురుషులు కాల్చుకుని తినడం వల్ల శృంగార సామర్థ్యం పెరుగుతుంది. వీర్యం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి. వెల్లుల్లి రెబ్బలను తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి సీజనల్ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. అయితే వెల్లుల్లి ఆరోగ్యకరమే అయినప్పటికీ గ్యాస్ సమస్య, అసిడిటీ, కడుపులో అల్సర్లు, శరీరంలో వేడి ఉన్నవారు మాత్రం తినరాదు. అలాగే పాలిచ్చే తల్లులు, గర్భిణీలు డాక్టర్ సూచన మేరకు వీటిని తినవచ్చు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…