T20 World Cup 2022 : ప‌ర‌మ చెత్త ఆట‌.. సెమీఫైన‌ల్‌లో ఇలాగేనా ఆడేది.. ఒక్క వికెట్ కూడా తీయ‌లేక‌పోయారు.. క‌ట్ట‌లు తెంచుకుంటున్న ఫ్యాన్స్ ఆగ్ర‌హం..

T20 World Cup 2022 : అనుకున్న‌దంతా జ‌రిగింది.. మొద‌టి నుంచి అన్ని విభాగాల్లోనూ ప‌టిష్టంగా లేని టీమిండియా అస‌లు ఇంత వ‌ర‌కు రావ‌డ‌మే గొప్ప అని అనుకున్నారు. అలాగే ప్లేయ‌ర్లు ఆడారు. దీంతో గెల‌వాల్సిన మ్యాచ్‌లో దారుణ ఓట‌మి పాల‌య్యారు. క‌నీసం ఇంగ్లండ్‌కు చెందిన ఒక్క వికెట్‌ను కూడా తీయ‌లేక‌పోయారు. దీంతో టీమిండియా ప్లేయ‌ర్లు ఇంటా బ‌య‌ట విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటున్నారు. ఎప్ప‌ట్లాగే చెత్త షాట్స్‌ను ఆడి వికెట్ల‌ను స‌మ‌ర్పించుకున్నారు. దీంతో సాధించాల్సిన ల‌క్ష్యం త‌క్కువే అయింది. ఇంగ్లండ్‌కు అది క‌ల‌సి వ‌చ్చింది. మొద‌టి నుంచి దూకుడుగా ఆడారు. ఈ క్ర‌మంలోనే ఇంగ్లండ్ ప్లేయ‌ర్ల‌కు భార‌త బౌల‌ర్లు అడ్డుక‌ట్ట వేయ‌లేక‌పోయారు. అస‌లు ఏమాత్రం ప్ర‌భావం చూపించ‌లేక‌పోయారు. దీంతో ప‌రాజ‌యం పాలు కావ‌ల్సి వ‌చ్చింది.

కీల‌క మ్యాచ్‌లో గెలిస్తే ఫైన‌ల్స్‌లో పాక్‌తో త‌ల‌ప‌డాల్సి వ‌చ్చేది. ఆ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠ‌గా ఎదురు చూశారు. ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ త‌మ ఆశ‌ల‌ను అడియాశ‌లు చేశార‌ని ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. సెమీ ఫైన‌ల్ మ్యాచ్ అంటే ఎలా ఉండాలి.. ఇలాగేనా ఆడేది.. ప‌ర‌చ చెత్త ఆట‌.. చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌.. అంటూ ఫ్యాన్స్ ప్లేయ‌ర్ల‌పై విరుచుకు ప‌డుతున్నారు. వ‌ర‌ల్డ్ క‌ప్‌లో అస‌లు మొద‌టి నుంచి భార‌త జ‌ట్టు ఆట తీరు అలాగే ఉంది. లీగ్ మ్యాచ్‌ల‌లో చాన్స్ ఉంటుంది కాబ‌ట్టి ఎలాగో త‌డ‌బ‌డినా సెమీస్ వ‌ర‌కు వ‌చ్చింది. కానీ ఇక్క‌డ మాత్రం తేలిపోయింది. త‌మ‌లో స‌త్తా లేద‌ని.. తాము ఇంతేన‌ని మ‌రోమారు ప్లేయ‌ర్లు నిరూపించుకున్నారు. దీంతో ఫ్యాన్స్ ఆగ్ర‌హం క‌ట్టలు తెంచుకుంటోంది.

T20 World Cup 2022 indian fans angry on team for losing in semi final
T20 World Cup 2022

వేల‌కు వేల్ల కోట్లు పెట్టి ఐపీఎల్‌ను నిర్వ‌హిస్తారు. స‌రైన ప్లేయ‌ర్ల‌ను ఎంపిక చేయ‌డంలో మాత్రం అల‌స‌త్వం వ‌హిస్తారు. అంటూ నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. వ‌ర‌ల్డ్ క‌ప్ అంటే మ‌ళ్లీ ఎప్ప‌టికో కానీ రాదు. అలాంటిది సెమీస్‌లో చాన్స్ వ‌స్తే.. కనీసం ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుపై ఒత్తిడి తేలేక‌పోయారు. ఒక్క‌టంటే ఒక్క వికెట్ కూడా తీయ‌లేదు. ఇదేం ఆట‌.. అంటూ ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు. అయితే టీమిండియా ఇలాగే ఆడితే మాత్రం ఎన్ని ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను నిర్వ‌హించినా వేస్టేన‌ని.. స‌రైన ప్లేయ‌ర్ల‌ను ఎంపిక చేస్తేనే జ‌ట్టు విజ‌యావ‌కాశాలు మెరుగు ప‌డ‌తాయ‌ని విశ్లేష‌కులు అంటున్నారు. మ‌రి బీసీసీఐ ఇక‌నైనా దీనిపై దృష్టి సారిస్తుందేమో చూడాలి.

Share
editor

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago