YS Jagan Biopic : ఇటీవల బయోపిక్స్‌కి మంచి ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో సినిమా, పొలిటికల్, స్పోర్ట్స్ పర్సనాలిటీస్‌కి సంబంధించి వారి జీవిత నేపథ్యంలో పలు సినిమాలు రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ జీవిత నేపథ్యంలో బయోపిక్‌కి సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇదివరకే దుల్కర్ తండ్రి మమ్ముట్టి, వైఎస్ జగన్ తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ లో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి.
అయితే ఆ సినిమాకు కొనసాగింపుగా సీక్వెల్ జగన్ బయోపిక్ రాబోతున్నట్లు అప్పట్లో చాలా రకాల కథనాలు వచ్చాయి. అయితే దుల్కర్ సల్మాన్ కూడా అందులో అవకాశం వస్తే నటిస్తానని కాకపోతే స్క్రిప్ట్ కూడా నచ్చే విధంగా ఉండాలి అని అన్నాడు. అయితే ఇప్పుడు అన్నీ ఆయనకు అనుకూలంగా ఉండడంతో జగన్ బయోపిక్‌లో దుల్కర్ నటించడం ఫైనల్ అయినట్టు తెలుస్తుంది. 2024 ఎన్నికల నేపథ్యంలో జగన్ బయోపిక్ ప్లాన్ చేస్తుండగా, ఇది జగన్ రాజకీయ జీవితానికి ఊతం ఇచ్చేలా.ఉండనున్నట్టు తెలుస్తోంది. గతంలో యాత్ర సినిమాను తెరకెక్కించిన దర్శకుడు మహి వి రాఘవ డైరెక్షన్లో ఈ సినిమా రానుంది.
ఈ సినిమా కోసం భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడంతో ఈ ప్రాజెక్టుకు దుల్కర్ సల్మాన్ ఓకే చెప్పారని తెలుస్తోంది. దుల్కర్ ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరయ్యాడు. మహానటి, సీతారామం సినిమాలతో దుల్కర్ తెలుగులో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. ఇప్పుడు జగన్ బయోపిక్ తో తన క్రేజ్ మరింత పెంచుకోవాలని అనుకుంటున్నాడట. యాత్ర 2 అనే టైటిల్‌తో రూపొందనున్న ఈ సినిమాలో వైయస్సార్ చనిపోయిన తర్వాత ఎదురైనా పరిస్థితులు, జగన్ ఎదుర్కొన్న తీరు ప్రధానంగా ఈ మూవీలో చూపించబోతున్నారని సమాచారం. భారీ బడ్జెట్ తో ఈమూవీ రూపొందుతున్నట్టు సమాచారం.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…