T20 World Cup 2022 : అనుకున్నదంతా జరిగింది.. మొదటి నుంచి అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా లేని టీమిండియా అసలు ఇంత వరకు రావడమే గొప్ప అని అనుకున్నారు. అలాగే ప్లేయర్లు ఆడారు. దీంతో గెలవాల్సిన మ్యాచ్‌లో దారుణ ఓటమి పాలయ్యారు. కనీసం ఇంగ్లండ్‌కు చెందిన ఒక్క వికెట్‌ను కూడా తీయలేకపోయారు. దీంతో టీమిండియా ప్లేయర్లు ఇంటా బయట విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఎప్పట్లాగే చెత్త షాట్స్‌ను ఆడి వికెట్లను సమర్పించుకున్నారు. దీంతో సాధించాల్సిన లక్ష్యం తక్కువే అయింది. ఇంగ్లండ్‌కు అది కలసి వచ్చింది. మొదటి నుంచి దూకుడుగా ఆడారు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ ప్లేయర్లకు భారత బౌలర్లు అడ్డుకట్ట వేయలేకపోయారు. అసలు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. దీంతో పరాజయం పాలు కావల్సి వచ్చింది.
కీలక మ్యాచ్‌లో గెలిస్తే ఫైనల్స్‌లో పాక్‌తో తలపడాల్సి వచ్చేది. ఆ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూశారు. ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ తమ ఆశలను అడియాశలు చేశారని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెమీ ఫైనల్ మ్యాచ్ అంటే ఎలా ఉండాలి.. ఇలాగేనా ఆడేది.. పరచ చెత్త ఆట.. చెత్త ప్రదర్శన.. అంటూ ఫ్యాన్స్ ప్లేయర్లపై విరుచుకు పడుతున్నారు. వరల్డ్ కప్‌లో అసలు మొదటి నుంచి భారత జట్టు ఆట తీరు అలాగే ఉంది. లీగ్ మ్యాచ్‌లలో చాన్స్ ఉంటుంది కాబట్టి ఎలాగో తడబడినా సెమీస్ వరకు వచ్చింది. కానీ ఇక్కడ మాత్రం తేలిపోయింది. తమలో సత్తా లేదని.. తాము ఇంతేనని మరోమారు ప్లేయర్లు నిరూపించుకున్నారు. దీంతో ఫ్యాన్స్ ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.
వేలకు వేల్ల కోట్లు పెట్టి ఐపీఎల్‌ను నిర్వహిస్తారు. సరైన ప్లేయర్లను ఎంపిక చేయడంలో మాత్రం అలసత్వం వహిస్తారు. అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వరల్డ్ కప్ అంటే మళ్లీ ఎప్పటికో కానీ రాదు. అలాంటిది సెమీస్‌లో చాన్స్ వస్తే.. కనీసం ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి తేలేకపోయారు. ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా తీయలేదు. ఇదేం ఆట.. అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అయితే టీమిండియా ఇలాగే ఆడితే మాత్రం ఎన్ని ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించినా వేస్టేనని.. సరైన ప్లేయర్లను ఎంపిక చేస్తేనే జట్టు విజయావకాశాలు మెరుగు పడతాయని విశ్లేషకులు అంటున్నారు. మరి బీసీసీఐ ఇకనైనా దీనిపై దృష్టి సారిస్తుందేమో చూడాలి.