Barrelakka : ఆశ్చర్యాలూ అద్భుతాలూ ఆదర్శాలు అనేవి గెలుపులో సక్సెస్ అవుతాయి. తెలంగాణ ఎన్నికల రంగస్థలం మీద చిన్న కలకలపు కదలిక కనిపించసాగింది. అదెవరో కాదు బర్రెలక్క.కర్నె శిరీష జీవితం ఆమెని బర్రెలక్కని చేసింది. ఇష్ట సమాజం ఆమెకు అదే పేరు ఖరారు చేసింది. ఈ మాలపిల్ల నాగర్ కర్నూలు జిల్లాలోని రెడ్డి, రావు దొరల నియోజకవర్గమైన కొల్లాపూర్‌లో అన్‌రిజర్వ్‌డ్ యుద్ధం చేస్తున్నది. తెలంగాణలో ఇప్పుడు అత్యంత బాధిత వర్గంగా మారిన నిరుద్యోగుల తరఫున గొంతుగా మారింది. జనానికి కావలసింది జరగడం లేదు కాబట్టి ప్రజాప్రతినిధిగా గెలిచి పనులు చేయాలని బర్రెలక్క అనుకుంటున్నది. ఆ అమ్మాయికి ఈ అధికార రాజకీయాలు తెలియవు. ఎన్నికల్లోకి దిగాలంటే ఎంత డబ్బు కావాలో, ఏమేమి హంగులుండాలో, అన్నిటికి మించి ఎంతటి నేపథ్యం ఉండాలో కూడా ఆమెకు పూర్తి అవగాహన లేదు.
కాని బర్రెలక్క ప్రచారంలో దూసుకుపోతుంది. అయితే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బర్రెలక్కతో పాటు ఆమె తమ్ముడిపై దాడి చేశారు. ఈ దాడిలో ఆమె తమ్ముడు భరత్ కుమార్ (చింటూ)ను తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో బర్రెలక్కకు ఎలాంటి కాలేదు కానీ.. ఆమె తమ్ముడు గాయపడ్డాడు. దాడి తర్వాత బర్రెలక్క బోరున విలపించారు. తాను ఏం పాపం చేశానని ఇలా దాడులు చేస్తున్నారంటూ కన్నీరు పెట్టుకుంది. చిన్నవాడైన తన తమ్మున్ని తన కళ్ల ముందే కొట్టారని చెప్పుకొచ్చింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బర్రెలక్క దాడిని చాలా మంది ఖండిస్తున్నారు. వరంగల్ జిల్లా కోర్టుకు చెందిన న్యాయవాదితో పాటు మరో హైకోర్టు న్యాయవాది ఆమె ఇంటికి వెళ్లారు. బర్రెలక్క తల్లి శిరీషతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ దాడి ఘటన దురదుష్టకరమని.. మీకు న్యాయం చేసేందుకు అమెరికా నుంచి ఇద్దరు అడ్వకేట్లు వస్తున్నట్లు చెప్పారు. జిల్లా ఎస్పీతో మాట్లాడి బర్రెలక్కకు ప్రొటెక్షన్ ఇప్పిస్తామని.. ఆమె ఇంటి వెద్ద ఎప్పుడూ ఓ కానిస్టేబుల్ ఉండేలా ఎస్పీతో మాట్లాడుతామని చెప్పారు.ఇక బర్రెలక్కకి సపోర్ట్‌గా ఇంటర్నేషనల్ లాయర్ కావేటి శ్రీనివాసరావు కూడా ఆమెకి సపోర్ట్ అందించారు. తను మాట్లాడుతున్న మాటలలో ఎక్కడ తప్పులేదు. ప్రభుత్వంని కూడా ఆమె ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదు. ఆమెది ఎలాంటి తప్పులేదు. ఆమె సోదరుడిపై కూడా దాడి చేశారు. బ్యాక్‌గ్రౌండ్ లేదు కనుక ఆమెపై ఇలా దాడి జరుగుతుంది. ఆమెకి తప్పక సపోర్ట్ అందిస్తాను. నాకు రాజకీయాలపై ఇంట్రెస్ట్ లేదు. బర్రెలక్క కోసం సపొర్ట్ అందిస్తాను అని అన్నారు.