Poorna : బుల్లితెర, వెండితెర అన్న తేడా లేకుండా తెగ సందడి చేస్తున్న అందాల ముద్దుగుమ్మ పూర్ణ. అవును, అవును 2 చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకి మంచి వినోదం పంచిన పూర్ణ ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా సత్తా చాటుతుంది. బుల్లితెరపై వచ్చిన క్రేజ్ ద్వారా మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టేయగా, పెద్ద సినిమాల్లో చాన్సులు వస్తున్నాయి. ఇటు సిల్వర్ స్క్రీన్, అటు స్మాల్ స్క్రీన్‌లో పూర్ణ దుమ్ములేపుతోంది. ‘శ్రీ మహాలక్ష్మి’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పూర్ణ.. అల్లరి నరేష్‌తో కలిసి సీమటపాకాయ్ చిత్రంలో నటించింది. అయితే ఈమెకు మాత్రం అవును సినిమాతోనే గుర్తింపు వచ్చింది.
`ఢీ` డాన్స్ షోతో మంచి క్రేజ్‌ని సొంతం చేసుకున్న పూర్ణ గ్లామర్ ఫోటోలతోనూ ఫాలోయింగ్‌ని పెంచుకుంది. వరుసగా ఆమె ఫోటో షూట్ పిక్స్ ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంటూ ఆకట్టుకుంటుంది. నెటిజన్లకి ట్రీట్ ల మీద ట్రీట్ లిస్తుంది. జూన్ 12న దుబాయ్ బేస్డ్ వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీని వివాహం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ దీపావళి కానుకగా తమ పెళ్లి ఫోటోలు షేర్ చేసింది. ఇక తాజాగా తన భర్త షానిద్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు అని పూర్ణ చెప్పుకొచ్చింది. వాట్సాప్ ప్రొఫైల్‌లో షానిద్ ఫోటోని పెట్టి సామాన్యుల నుంచి డబ్బులను లాగుతున్నారు. ఈ విషయం తాజాగా పూర్ణ వద్దకు చేరడంతో అసలు విషయం తన ఇన్‌స్టా స్టేటస్ ద్వారా తెలియజేసింది.
అది నా భర్త నెంబర్ కాదని స్పష్టం చేసింది పూర్ణ. తన భర్త ఫోటోని చూపి మోసంచేస్తున్నారని, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. అంతేకాదు ఒకవేళ ఎవరైనా మోసపోతే అందుకు తన భర్త కారణం కాదని ఇన్‌స్టా స్టోరీస్ ద్వారా వెల్లడించింది పూర్ణ. పూర్ణ ఇటీవల తన భర్తతో కలిసి హీరో విక్రమ్ కి గోల్డెన్ వీసా అందించిన విషయం తెలిసిందే.