T20 World Cup 2022 : సూర్య‌కుమార్ యాద‌వ్ కు ఉన్న బ‌ల‌హీన‌త అదొక్క‌టేనా.. ఇంగ్లండ్ ఏం చేస్తుంది..?

T20 World Cup 2022 : ఆస్ట్రేలియా వేదిక‌గా అడిలైడ్‌లో జ‌ర‌గ‌నున్న టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2022 రెండో సెమి ఫైన‌ల్ కోసం భార‌త్‌, ఇంగ్లండ్ జ‌ట్లు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే జ‌రిగిన మొద‌టి సెమిఫైన‌ల్‌లో న్యూజిలాండ్ పై పాకిస్థాన్ గెలిచి ఫైన‌ల్స్‌కు చేరుకుంది. దీంతో భార‌త్ కూడా గెల‌వాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే తాజాగా ఒక వార్త వైర‌ల్‌గా మారింది. ఈ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 225 ప‌రుగులు చేసి దూకుడు మీదున్న సూర్య‌కుమార్ యాద‌వ్‌ను క‌ట్ట‌డి చేసేందుకు ఇంగ్లండ్ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తుంద‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆ జ‌ట్టుకు చెందిన మాజీ బ్యాట్స్‌మ‌న్ నాస‌ర్ హుస్సేన్ ఒక వ్య‌క్తిని వాట్సాప్ ద్వారా సంప్ర‌దించాడు.

సూర్య‌కుమార్ యాద‌వ్ బ‌లం, బ‌ల‌హీన‌తలు ఏమిటి..? అని హుస్సేన్ ఆ వ్య‌క్తిని వాట్సాప్ ద్వారా కోరాడు. అయితే ఆ వ్య‌క్తి ఇలా రిప్లై ఇచ్చాడు. సూర్య‌కుమార్ యాద‌వ్‌కు అన్నీ బ‌లాలే ఉన్నాయి. బ‌ల‌హీన‌త‌లు లేవు. అత‌ను మైదానంలో ఏ దిశ‌లో అయినా ఆడ‌గ‌ల‌డు. క‌నుక మీరు ఏమీ చేయ‌లేరు.. అని స‌మాధానం ఇచ్చాడు. అయితే సూర్య‌కుమార్ యాద‌వ్ గ‌తంలో ఇంగ్లండ్ బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోశాడు. క‌నుక ఇంగ్లండ్ అత‌న్ని వీలైనంత త్వ‌ర‌గా ఔట్ చేసేందుకు ప్ర‌ణాళిక‌లు రచిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

T20 World Cup 2022 england planning for surya kumar yadav batting
T20 World Cup 2022

అయితే సూర్య‌కుమార్ యాద‌వ్ స్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ లో స‌రిగ్గా ఆడ‌లేడ‌ని కొంద‌రు నిపుణులు అంటున్నారు. కానీ ఇంగ్లండ్ జ‌ట్టులో ప్ర‌స్తుతం అలాంటి బౌల‌ర్ ఎవ‌రూ లేరు. డాస‌న్ అనే బౌల‌ర్ ఉన్నాడు. కానీ అత‌ను ఇప్ప‌టి వ‌ర‌కు టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడ‌లేదు. క‌నుక ఇంగ్లండ్ అత‌న్ని కేవ‌లం సూర్య‌కుమార్ యాద‌వ్ కోసం ఆడిస్తుంద‌ని గ్యారెంటీ లేదు. అయితే గ‌తంలో ఇంగ్లండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌ల‌లో జోఫ్రా ఆర్చ‌ర్‌, మార్క్‌వుడ్ వంటి బౌల‌ర్ల‌ను సూర్య‌కుమార్ యాద‌వ్ ప‌రుగులెత్తించాడు. క‌నుక ఇవాళ్టి మ్యాచ్‌లో అత‌ను ఎలా ఆడుతాడు అన్న‌ది ఆసక్తిక‌రంగా మారింది.

Share
editor

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago