Samantha And Naga Chaitanya : టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ నాగ చైతన్య, సమంత గత ఏడాది అక్టోబర్ 2న విడాకులు తీసుకొని అందరికి పెద్ద షాకిచ్చిన విషయం తెలిసిందే. వీరు విడిపోయి ఏడాది అవుతున్నా కూడా వారు విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏంటనేది ఇప్పటి వరకు ఎవరికి తెలియదు కాని వాటికి సంబంధించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. అయితే సమంత ఇటీవల మయోసైటిస్ బారిన పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలియజేసింది. దీంతో అందరు సమంత త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు. ఇక నాగ చైతన్య కూడా పాతవన్నీ మరచిపోయి సమంత దగ్గరకు వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నాడట.
సమంతకు కావల్సిన ధైర్యం కూడా అందించాడనే టాక్ నడుస్తుంది. ఇప్పటి నుండి వారిద్దరు స్నేహితులుగా ఉంటారని,త్వరలో కలిసి సినిమా చేయనున్నారని కొన్ని ప్రచారాలు నడుస్తున్నాయి. ఆ మధ్య కాఫీ విత్ కరణ్ జోహార్ షోలో నాగ చైతన్యని, సమంతని ఒకే రూంలో ఉంచితే పదునైన వస్తువులు లేకుండా చూడాలని చెప్పుకొచ్చింది. అంటే ఇద్దరి మధ్య అంత పగ ఉందా అనే అనుమానాలు అభిమానుల మదిలో మెదిలాయి. అయితే సమంత అనారోగ్యం బారిన పడిన తర్వాత చైతూ చాలా కేరింగ్ తీసుకోవడంతో ఇద్దరు మంచి ఫ్రెండ్స్‌గా మారారాని, త్వరలో కలిసి సినిమా కూడా చేయనున్నారని ప్రచారం నడుస్తుంది.
సమంత, నాగచైతన్య వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సామ్ చై కలిసి ఏ మాయ చేశావే సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత మజిలీ, ఆటోనగర్ సూర్య వంటి సినిమాలు చేశారు. ఆ క్రమంలో ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెద్దల్ని ఒప్పించి ఒక్కటయ్యారు.విడాకుల తర్వాత ఇద్దరు సోలో జీవితం గడుపుతున్నారు. అయితే సమంత మరియు నాగ చైతన్య ని పెట్టి ఒక సినిమా చెయ్యాలనే ఆలోచనలో ప్రముఖ టాలీవుడ్ టాప్ నిర్మాత దిల్ రాజు ఉన్నట్టు ఆ మధ్య ఫిలిం నగర్ లో ఒక వార్త తెగ చక్కర్లు కొట్టింది…విడాకులు తర్వాత వీళ్లిద్దరు కలిసి నటిస్తే అదొక క్రేజీ కాంబినేషన్ అవుతుందని..బాక్స్ ఆఫీస్ వద్ద కూడా బాగా వర్కౌట్ అవుతుందని దిల్ రాజు ఆలోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…