Divya Bharti : దివ్యభారతిది హత్యా లేక ఆత్మహత్యా..? అసలు ఆమె మరణించిన రోజు ఏం జరిగింది..?

Divya Bharti : 1990 దశాబ్దంలో బాగా క్రేజ్ ఉన్న హీరోయిన్ దివ్యభారతి. అతి చిన్న వయసులోనే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. వెంకటేష్ హీరోగా నటించిన బొబ్బిలి రాజా చిత్రంతో టాలీవుడ్ వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ పాటు బాలీవుడ్ లో కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో దివ్య భారతి నటించి అలరించింది.

బాలీవుడ్ లో దివానా, రంగ్ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన దివ్యభారతి టాలీవుడ్ లో అసెంబ్లీ రౌడీ, రౌడీ అల్లుడు, ధర్మ క్షేత్రం, చిట్టెమ్మ మొగుడు లాంటి సినిమాల్లో నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. అప్పటి హీరోయిన్లలో దివ్యభారతి అంతా బ్యూటీ ఫుల్ హీరోయిన్ ఎవరు లేరు. చిన్న వయసులోనే ఎంతో స్టార్ డమ్ ని పొందిన దివ్యభారతి  కేవలం 19 ఏళ్ల వయసులోనే ఏప్రిల్ 5 1993 లో ఈ లోకానికి దూరమయ్యింది.  అయితే దివ్యభారతి ఎలా చనిపోయింది అన్న ప్రశ్నకు సమాధానం ఇప్పటివరకు ఒక సరైన క్లారిటీ రాలేదు. కోర్టు కూడా ఆమె కేసులో సరైన తీర్పు ఇవ్వకుండానే 1998 లో కేసును క్లోజ్ చేసేసింది. కానీ ఆమె అభిమానులకు ఇప్పటికి కూడా దివ్యభారతి  మరణంపై ఎన్నో అనుమానాలు తలెత్తుతానే ఉన్నాయి.

what really happened on that day Divya Bharti death
Divya Bharti

 

అసలు దివ్యభారతి  మరణం రోజు ఏం జరిగింది అనే విషయానికి వెళితే.. దివ్యభారతి తన భర్త సాజిత్ తో కలిసి ముంబైలోని ఒక అపార్ట్ మెంట్ లో నివాసం ఉండేది. చనిపోయిన రోజు దివ్యభారతి షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చింది. అదే రోజు తన పేరెంట్స్ కోసం ఒక ఇంటిని కూడా కొనుగోలు చేసింది. అన్ని పనులు ముగించుకుని ఇంటికి చేరుకున్న దివ్య భారతి తన మేకప్ ఆర్టిస్ట్ కు ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచింది. మేకప్ ఆర్టిస్ట్ తో పాటు ఆమె భర్త సాజిత్ కూడా వెంట వచ్చాడు. ఆ తరవాత అందరూ కలిసి మద్యం సేవించారు. అప్పటి వరకు వాళ్లతో మాట్లాడిన దివ్యభారతి ఉన్నట్టుండి బాల్కనీ నుండి క్రిందకు పడిపోయింది.

తలకు బలమైన గాయం అయ్యి రక్తపు మడుగులో ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించే లోపే తుది శ్వాస విడిచింది. అయితే ఆమె మరణం పై భర్త సాజిత్ కానీ, అక్కడే ఉన్న మేకప్ ఆర్టిస్ట్ గానీ నోరు విప్పలేదు. మరోవైపు దివ్యభారతి మరణం వెనక దావూద్ ఇబ్రహీం డీ గ్యాంగ్ హస్తం ఉంది అనే ఆరోపణలు కూడా అప్పటిలో గట్టిగా వినిపించాయి. అంతేకాకుండా ఆమె భర్త సాజిత్ ముంబై పేలుళ్ల కేసు నుండి బయట పడేందుకు గాను ఆమెను హత్య చేసి ఉంటాడు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా సినిమాల్లో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగవలసిన  దివ్యభారతి అతి చిన్న వయసులోనే నింగి ఎగసి ఎంతోమంది అభిమానులకు బాధను మిగిల్చింది.

Share
Mounika Yandrapu

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 month ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 month ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago