Surekha Vani : నటి సురేఖా వాణి..ఇటీవలి కాలంలో తెగ వార్తలలో నిలుస్తుంది. ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అదరగొట్టిన ఈ భామ ఇటీవలి కాలంలో కుమార్తెతో కలిసి.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటుంది. ఎప్పుడు సినిమా పాటలు, డైలాగ్స్‌కు రీల్స్ చేసి, వీడియోలు చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసే సురేఖా వాణి.. గత కొన్ని రోజులుగా వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డైలాగ్స్ మీద రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తాజాగా మరోసారి షర్మిల అన్న మాటలతోనే రీల్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
వైఎస్ షర్మిల.. ఇటీవలి కాలంలో తెలంగాణ రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉన్నారు. ఆమె ఎక్కడ, ఎప్పుడు, ఏది మాట్లాడినా అది సెన్సేషన్ అవుతుంది. ఆమె మాటలు ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా తెగ తిరుగుతున్నాయి. ముఖ్యంగా ఆమె మాట్లాడిన వాటిలో ‘పాదయాత్ర అంటే ఏంటి’, ‘స్టూడెంట్స్ అని ఎందుకు అంటారు’, ‘ఆడపిల్ల అంటే ఏంటి’, ‘మీ ఆవిడా అని ఎందుకంటారు’.. అనే వీడియోలు అయితే ఓ రేంజ్‌లో పాపులర్ అయ్యాయి.
తాజాగా సురేఖావాణి కూడా ఇలానే ఓ రీల్ చేసింది. సూడెంట్స్ అని ఎందుకు అంటున్నామంటే వాళ్లు యువత కాబట్టి..” అని షర్మిలక్క అన్న మాటలను ట్రోల్ చేస్తూ “నువ్వు నీకు దండం పెడతా నేను.. నువ్వు ఎంత తక్కువ పాజిబులో అంతనే మాట్లాడు రాధిక.. ఎందుకంటే నాకు ఒక రకమైన టిపికల్ ఏంగ్జయిటీ వస్తుంది నాకు.. నువ్వు మాట్లాడుతుంటే..!” అని డేజే టిల్లు సినిమాలో చెప్పిన డైలాగ్‌తో ఓ రీల్ చేసింది సురేఖావాణి. ఇప్పుడు ఇది తెగ వైరల్ అవుతుంది. సురేఖావాణి పోస్ట్ చేసిన రీల్ చూసిన చాలా మంది నెటిజనులు.. సూపర్ అంటూ లైకులు కొట్టారు. అయితే కొంతమంది మాత్రం.. ‘‘మేడమ్ మీరు వైఎస్ షర్మిలను అవమానిస్తున్నారు, షర్మిలక్కను ట్రోల్ చేస్తున్నారు” అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…