Jr NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహం జూనియర్ ఆనందాన్ని రెట్టింపు చేసింది. ఇప్పుడు అదే ఉత్సాహంతో కొరటాల శివ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. జాన్వి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో చాలా సర్ ప్రైజ్ లు ఉంటాయని తెలుస్తోంది. కచ్చితంగా పాన్ ఇండియా రేంజ్ లో ఎన్టీఆర్ తన సత్తా చాటేలా ఉంటుందని ప్రచారం జరుగుతుంది.. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా ప్లానింగ్ లో ఉంది. రాజమౌళి కూడా ఎన్టీఆర్ తో సినిమాకు రెడీ అంటున్నాడు.
అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా సందడి చేస్తున్నాడు. ఇప్పటికే బిగ్ బాస్, మీలో ఎవరు కోటీశ్వరుడు అనే ప్రోగ్రాంస్ చేశాడు. ఇప్పుడు మరోసారి స్మాల్ స్క్రీన్ పై కూడా మెరవబోతున్నాడట .ఈటీవీ ఓటీటీ ఈటీవీ విన్ కోసం ఈ స్పెషల్ షో ప్లాన్ చేస్తున్నారట. ఈ షోకి ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తారని అంటున్నారు. ఈ షో చాలా స్పెషల్ గా ఉండబోతుందని ఇప్పటికే తారక్ షో కాన్సెప్ట్ విని ఓకే అన్నారని టాక్. మరి దీనిపై పూర్తి క్లారిటీ రావలసి ఉంది.
ఎన్టీఆర్ మొదటి సినిమా నిన్ను చూడాలని నిర్మించింది రామోజి రావు. ఈటీవీ విన్ ఓటీటీకి క్రేజ్ వచ్చేందుకు ఆయన కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ తో షో ప్లాన్ చేస్తే యూజర్స్ పెరుగుతారని భావిస్తున్నారు. ఎన్టీఆర్ టాక్ షో వస్తే మాత్రం దాని లెక్క వేరేలా ఉంటుందని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 1 హోస్ట్ గా చేసి అలరించిన ఎన్టీఆర్ స్మాల్ స్క్రీన్ మీద తన ఎనర్జీ లెవెల్స్ తో అందరిని సర్ ప్రైజ్ చేస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే తారక్ రాబోతున్న సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో తన స్టామినా ఏంటన్నది ప్రూవ్ చేయబోతున్నారు. కొరటాల శివ మాత్రమే కాదు ప్రశాంత్ నీల్ సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని అభిమానులు భావిస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…