Sugali Preethi Mother : నా కూతురిని చంపిన‌ప్పుడు రాని మహిళా కమిషన్ ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం వ‌చ్చిందా..?

Sugali Preethi Mother : జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏలూరు స‌భ‌లో మాట్లాడిన మాట‌లు సంచ‌ల‌నంగా మారాయి. ఆయ‌న వాలంటీర్ల గురించి చేసిన వ్యాఖ్య‌ల ప‌ట్ల వైసీపీ నాయ‌కులు, వాలంటీర్లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ప‌వ‌న్ నోటికి వ‌చ్చిన‌ట్టు మాట్లాడ‌డం వ‌ల‌న మ‌హిళా క‌మిష‌న్‌కు భారీగా ఈమెయిల్స్ ద్వారా మ‌హిళా సంఘాలు, వాలంటీర్లు ఫిర్యాదులు వెళ్లాయి. ఈ విష‌యాన్ని ఏపీ మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్ వాసిరెడ్డి ప‌ద్మ తెలిపారు. మ‌హిళ‌ల అక్ర‌మ ర‌వాణాకు వాలంటీర్లు పాల్ప‌డుతున్నార‌ని త‌న‌కు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయ‌ని ప‌వ‌న్ కామెంట్స్‌పై వాసిరెడ్డి ప‌ద్మ ఫైర్ అయ్యారు.

ప‌వ‌న్‌కు నోటీసులు జారీ చేసిన‌ట్టు ఆమె వెల్ల‌డించారు. ప‌ది రోజుల్లోపు స‌మాధానం ఇవ్వాల‌ని నోటీసుల్లో పేర్కొన్నారు. వాలంటీర్లపై పవన్‌ విషం కక్కుతున్నారని, ఆయనకు ఏ ఇంటెలిజెన్స్‌ అధికార చెప్పారో సమాధానం చెప్పాలని కోరారు. ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసి పవన్‌ తప్పించుకోలేరన్నారు. వాలంటీర్లకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని వాసిరెడ్డి ప‌ద్మఅనుమానం వ్య‌క్తం చేశారు. యువత చెడిపోవడానికి పవన్‌ సినిమాలే కారణమని ఆమె చెప్పుకొచ్చారు. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌తో వారాహి యాత్ర ఎపిసోడ్ మొత్తం ప‌క్క‌దారి ప‌ట్టింది అని నిప్పులు చెరిగింది. అయితే ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై సుగాలి ప్రీతి త‌ల్లి ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

Sugali Preethi Mother angry on vasireddy padma
Sugali Preethi Mother

ఓ తల్లిగా, బాధితురాలిగా అడుగుతున్నా… సమాధానం చెప్పండని నిలదీసారు. ”అమ్మా… వాసిరెడ్డి పద్మగారు… నేను పార్వతీ దేవి… సుగాలి ప్రీతి తల్లిని. నా కూతురిపై జరిగిన దారుణం, మా కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి ఎన్నోసార్లు మహిళా కమీషన్ ను ఆశ్రయించాము… మేము ఆధారాలతో సహా అందించిన ఫైల్స్ మూలపడ్డాయి. ఒక్కసారి వాటిని చూసి మాకు న్యాయం చేయాలి. స్కూల్లో జరుగుతున్న ఆకృత్యాల గురించి పేజీలకు పేజీల ఫైల్స్ ఇచ్చా. ఇంతవరకు చర్యలు కాదుగదా కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు. ఆ స్కూల్లో అమ్మాయిల మానప్రాణాలకు రక్షణలేదన్నా పట్టించుకోని మీరు పవన్ కల్యాణ్ చెప్పిన రెండు మాటలకే నోటీసులు అందిస్తారా అని సుగాలి ప్రీతి తల్లి ప్రశ్నించారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago