Ambati Rayudu : ఏపీలో వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. పవన్ చేసిన కామెంట్స్ పై వాలంటర్లతోపాటు అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. స్వచ్ఛందంగా సేవలందించే వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని.. క్షమాపణలు చెప్పాలని ఏపీ మహిళా కమీషన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలపై 10 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలంటూ నోటీసులు కూడా జారీ చేసింది. ఇక పవన్ వ్యాఖ్యలపై తాజాగా అంబటి రాయుడు కూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు.
మాజీ ఇండియన్ క్రికెటర్ అంబటి రాయుడు.. పొలిటికల్ పిచ్‌పై సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి కనిపిస్తుంది. మొన్నటి ఐపీఎల్ సీజన్‌లో బౌన్సర్స్‌ని పెద్దగా ఎదుర్కోలేకపోయిన అంబటి రాయుడు.. ఇప్పుడు పొలిటికల్ బౌన్సర్లను ఎదుర్కొనేందుకు ప్రాక్టీస్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇటీవల ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసిన అంబటి రాయుడు.. పొలిటికల్‌గా యాక్టివ్ అయ్యారు. క్రియాశీలకంగా మారి.. పార్టీ వ్యవహారాల్లో చురుకుగా పాల్గొంటున్నట్టు కనిపిస్తుంది. రానున్న ఎన్నికల్లో అంబటి రాయుడు.. ఎంపీగానో.. ఎమ్మెల్యేగానో పోటీ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. పొలిటికల్ పిచ్‌పై సత్తా చాటాలి కాబట్టి ఇప్పుడేఆ వైపు అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వాలాంటీర్ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.
దీనిపై గుంటూరు పర్యటనలో భాగంగా.. ఓ స్కూల్‌కి వెళ్లి అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్.. విద్యార్ధులకు అందుతున్న వసతుల్ని స్వయంగా పర్యవేక్షించిన అంబటి రాయుడు.. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని తప్పుపడుతూ.. ఏపీ వాలంటీర్ వ్యవస్థ.. దేశానికే ఆదర్శం అని అన్నారు. అలాంటి బలమైన వ్యవస్థపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు అంబటి రాయుడు. గత 60-70 ఏళ్లుగా జరగని అభివృద్ది ఇప్పుడు జరుగుతుందంటే అది వాలంటీర్ వ్యవస్థ వల్లే. ప్రజలకు ప్రభుత్వం తరుపున అందాల్సిన ప్రతి రూపాయి అందుతుంది. ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు అందుతున్నాయి. కరోనా టైంలో వాలంటీర్‌లు ఎంత కష్టపడ్డారో చూశాం.. అలాంటి టైంలో కూడా ప్రాణాలకు తెగించి.. సేవల్ని అందించారు. అలాంటి వాలంటీర్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. మంచి పని చేస్తుంటే ఇలాంటి వాళ్లు బురదజల్లుతుంటారు. వాటిని మనం పట్టించుకోకూడదు. వాళ్లు విమర్శించారని ఆగిపోదు.. మరింత ధైర్యంగా వాలంటీర్ వ్యవస్థ ముందుకు వెళ్తుంది’ అని అన్నారు అంబటి రాయుడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…