Sugali Preethi Mother : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏలూరు సభలో మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయి. ఆయన వాలంటీర్ల గురించి చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ నాయకులు, వాలంటీర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ నోటికి వచ్చినట్టు మాట్లాడడం వలన మహిళా కమిషన్‌కు భారీగా ఈమెయిల్స్ ద్వారా మహిళా సంఘాలు, వాలంటీర్లు ఫిర్యాదులు వెళ్లాయి. ఈ విషయాన్ని ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. మహిళల అక్రమ రవాణాకు వాలంటీర్లు పాల్పడుతున్నారని తనకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయని పవన్ కామెంట్స్‌పై వాసిరెడ్డి పద్మ ఫైర్ అయ్యారు.
పవన్‌కు నోటీసులు జారీ చేసినట్టు ఆమె వెల్లడించారు. పది రోజుల్లోపు సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వాలంటీర్లపై పవన్ విషం కక్కుతున్నారని, ఆయనకు ఏ ఇంటెలిజెన్స్ అధికార చెప్పారో సమాధానం చెప్పాలని కోరారు. ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసి పవన్ తప్పించుకోలేరన్నారు. వాలంటీర్లకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని వాసిరెడ్డి పద్మఅనుమానం వ్యక్తం చేశారు. యువత చెడిపోవడానికి పవన్ సినిమాలే కారణమని ఆమె చెప్పుకొచ్చారు. పవన్ వ్యాఖ్యలతో వారాహి యాత్ర ఎపిసోడ్ మొత్తం పక్కదారి పట్టింది అని నిప్పులు చెరిగింది. అయితే పవన్ వ్యాఖ్యలపై సుగాలి ప్రీతి తల్లి ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఓ తల్లిగా, బాధితురాలిగా అడుగుతున్నా… సమాధానం చెప్పండని నిలదీసారు. ”అమ్మా… వాసిరెడ్డి పద్మగారు… నేను పార్వతీ దేవి… సుగాలి ప్రీతి తల్లిని. నా కూతురిపై జరిగిన దారుణం, మా కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి ఎన్నోసార్లు మహిళా కమీషన్ ను ఆశ్రయించాము… మేము ఆధారాలతో సహా అందించిన ఫైల్స్ మూలపడ్డాయి. ఒక్కసారి వాటిని చూసి మాకు న్యాయం చేయాలి. స్కూల్లో జరుగుతున్న ఆకృత్యాల గురించి పేజీలకు పేజీల ఫైల్స్ ఇచ్చా. ఇంతవరకు చర్యలు కాదుగదా కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు. ఆ స్కూల్లో అమ్మాయిల మానప్రాణాలకు రక్షణలేదన్నా పట్టించుకోని మీరు పవన్ కల్యాణ్ చెప్పిన రెండు మాటలకే నోటీసులు అందిస్తారా అని సుగాలి ప్రీతి తల్లి ప్రశ్నించారు.