Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా జగన్‌తో పాటు పలువురు మంత్రులపై దారుణమైన విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఏలూరు సభలో వాలంటీర్ వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్… సీఎం జగన్ వాలంటీర్ వ్యవస్థ హిట్లర్ నిఘా వ్యవస్థలాగా మారుతోందని హెచ్చరించారు. అందరనీ అనట్లేదు కానీ కొందరు వాలంటీర్లు ప్రజలను పరోక్షంగా భయపెడుతున్నారని ఆరోపించారు. కొందరు వాలంటీర్ల వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుందన్నారు. జర్మనీలో హిట్లర్ ఇలానే చేసేవాడని, దీనిని వాలంటీర్లు కూడా గమనించి నడుచుకోవాలని పవన్ కల్యాణ్ హితవు పలికారు.
జగన్ రెడ్డి జలగ లాంటోడని , ఆయన ఉన్నంత వరకు ఈ రాష్ట్రం బాగు పడదని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎవరు ఎన్ని రకాలుగా తనను దూషించినా సరే తాను సత్యం వైపు ఉంటానని, నిజం మాట్లాడి తీరుతానని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. జగన్ రెడ్డి లాంటోళ్లు ఉన్నంత కాలం పవన్ కళ్యాణ్ అనే ఒకడు వస్తూనే ఉంటాడని , జగన్ ఏర్పాటు చేసుకున్న వాలంటీర్ల అనే సమాంతర వ్యవస్థను న్యాయ పరంగా ఎదుర్కొంటామని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.తద్దినానికి అట్ల తద్దికి తేడా తెలియని వాడు, శార్ధానికి శ్రావణ శుక్రవారానికి తేడా తెలియని వాడు, అకి, ఆకి తేడా తెలియని వాడు ,వారాహికి వరాహికి తేడా తెలియని వాడు, ఆ మహానుభావుడు మన ముఖ్యమంత్రి.
పెళ్లికి వెళ్లు ఒకటే నవ్వు, చచ్చిపోయినప్పుడు అదే నవ్వు, ఎవరైన చెప్పండయ్యా అతనికి అంటూ జగన్‌పై భారీగా పంచ్‌లు వేసారు. తాను ఇండస్ట్రీలలోని పెద్ద హీరోలలో ఒకరు అని కూడా అన్నాడు పవన్. నేను పోటి పడి సినిమాలు చేయాలని అనుకుంటే వెయ్యి కోట్లు సంపాదిస్తాను. కాని అవన్నీ ఇక్కడికి వచ్చింది ప్రజలకు సేవ చేయాలని అని పవన్ పేర్కొన్నారు. అయితే పవన్ కళ్యాణ్.. జగన్‌పై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…