Roja : ప్రస్తుతం ఏపీలో రాజకీయం చాలా వాడివేడిగా ఉంది. వారాహి యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ పలు ప్రాంతాలలో బహిరంగ సభలు నిర్వహిస్తూ వైసీపీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఏలూరు సభలోపవన్ కళ్యాణ్ వలంటీర్లపై చేసిన ఆరోపణల దుమారం తగ్గట్లేదు. రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు రెండోరోజూ రోడ్డెక్కారు. పవన్ కల్యాణ్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఆయన ఫొటోలు, ఫ్లెక్సీలను తగులబెట్టారు. బహిరంగంగా క్షమాపణలు చెప్పేంత వరకూ వెనక్కి తగ్గబోమంటూ హెచ్చరించారు.మరోవైపు వైసీపీ నాయకులు కూడా పవన్ కళ్యాణ్‌పై నిప్పులు చెరుగుతున్నారు. వాలంటీర్ల వ్యవస్థ మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి రోజా ఫైర్ అయ్యారు.
కేంద్రం, ఇతర రాష్ట్రాలు సైతం వాలంటీర్ వ్యవస్థను మెచ్చుకుంటూ , ఆదర్శంగా తీసుకుంటున్నాయి. అలాంటి వ్యవస్థ గురించి పవన్ కళ్యాణ్ చులకనగా మాట్లాడడం దారుణం. వాలంటీర్ల కాళ్లు పట్టుకుని పవన్ క్షమాపణ కోరాలి. చంద్రబాబు గతంలో వలంటీర్ వ్యవస్థ పై నోటికొచ్చినట్టు మాట్లాడాడు. ఇప్పుడు దత్త పుత్రుడు విషం చిమ్ముతున్నాడు దమ్ముంటే ఒకటో తేదీన వస్తే.. వాలంటీర్లు ఎలాంటి వాళ్లో తెలుస్తుందని సవాల్ విసిరారు. కరోనా సమయంలో ప్రాణ భయంతో పవన్ కల్యాణ్, చంద్రబాబు హైదరాబాద్ వెళ్లి దాక్కున్నారని.. ప్రభుత్వంతో కలిసి వాలంటీర్లు నిస్వార్థ్యంగా సేవలందించారని గుర్తు చేసారు రోజా. ఇన్నాళ్లు జగన్‌ను చూస్తే పవన్, చంద్రబాబుకు వణుకు అనుకున్నాను, జగనన్న తీసుకువచ్చిన వాలంటీర్లను చూసి కూడా వణికిపోతున్నారని మంత్రి రోజా ఎద్దేవా చేశారు.
ప్రభుత్వంతో కలిసి వాలంటీర్లు నిస్వార్థ్యంగా సేవలందించారని గుర్తు చేశారామె. అలాంటి వాలంటీర్లపై పిచ్చి మాటలు మాట్లాడితే పళ్లు రాలగొడతారని అని హెచ్చరించారు మంత్రి రోజా. ఎన్‌సీఆర్‌బీ గణాంకాల ప్రకారం.. మహిళల మిస్సింగ్ కేసుల్లో టాప్ టెన్‌లో ఏపీ లేనే లేదు. ఎవరూ సంతోషంగా ఉండకూడదనే దరిద్రపు గొట్టు ఆలోచనతో పవన్ ఉన్నాడని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఆ లిస్ట్‌లో తెలంగాణ 6వ స్థానంలో ఉంది కదా. మరి ఆ రాష్ట్రం గురించి మాట్లాడవేం అని పవన్ కల్యాణ్‌ను నిలదీశారు. కేసీఆర్‌కు భయపడే మాట్లాడలేకపోతున్నాడని రోజా పంచ్‌లు విసిరింది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…