Vaishnavi Chaitanya : రౌడీబాయ్ విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో బేబి అనే చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. జూలై 14న విడుదల కానున్న ఈ చిత్రంలో విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలు పోషించారు. కలర్ ఫోటో లాంటి నేషనల్ అవార్డ్ సినిమాను ప్రొడ్యూస్ చేసిన సాయి రాజేష్ దర్శకత్వంలో బేబీ అనే సినిమా ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా రూపొందింది. ఎస్.కే.ఎన్ నిర్మించిన బేబీ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదల కాగా, ఇది ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు. ఇక ఇటీవల జరిగిన చిత్ర ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ చాలా ఎమోషనల్‌గా మాట్లాడింది.
కార్యక్రమానికి వచ్చిన వంశీ పైడిపల్లి సర్, మారుతి సర్‌లకు థాంక్స్. ఇన్ని ప్రేమ కథలు వచ్చాయి కదా? మేం ఈ సినిమా ఎందుకు చూడాలని అడగొచ్చు.. బేబీ సినిమాలో రియాల్టీని చూపించాం. అందరి లైఫ్‌లో జరిగేది చూపించాం. ప్రతీ పాత్రకు అందరూ కనెక్ట్ అవుతారు. ఇంత డెప్త్, ఇంపార్టెంట్ ఉన్న కారెక్టర్లు చాలా తక్కువ మందికి వస్తాయి. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మారుతి గారు, సాయి రాజేష్ గారికి థాంక్స్’ అని చెప్పింది వైష్ణవి. చిత్రంలో ఓ డైలాగ్ కూడా చెప్పి సినిమాపై అంచనాలు భారీగా పెంచింది. మూవీ ప్రతి ఒక్కరికి నచ్చుతుందని చెప్పిన వైష్ణవి చివరిలో ఎమోషనల్ కూడా అయింది.
బేబ సినిమా చూశాక అందరికీ ఓ వారం పాటు వెంటాడుతూ ఉంటుంది. పాటలు, మాటలు అన్నీ హంట్ చేస్తుంటాయి. అందరూ ప్రాణం పెట్టి సినిమాను చేశారు. ఇంకో సాలిడ్ రైటర్, గ్రేట్ డైరెక్టర్ దొరికాడని సాయి రాజేష్ అన్నను చూసి గర్వపడాలి. నాలోని యాక్టింగ్ పొటెన్షియల్‌ను సాయి రాజేష్ గారు నమ్మారు. ఆయన డైలాగ్స్, రైటింగ్‌ను చూస్తేనే ఎమోషనల్ అయ్యాను అని అన్నారు. విజయ్ బుల్గానిన్ అద్భుతమైన సంగీతం అందించారు. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు వస్తుంది. ఈ సినిమా ఒక కల్ట్ ట్రెండ్ అవుతుంది అని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…