Nara Lokesh : ఏపీలో వైసీపీ, టీడీపీ నాయకులు ఒకరిపై ఒకరు దారుణమైన విమర్శలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో నెల్లూరులో మాట్లాడిన లోకేష్.. అనీల్‌పై దారుణమైన విమర్శలు చేశారు. సిల్లీ బచ్చా అంటూ చురకలు అంటించారు. నీ నెల్లూరుకి వచ్చా.. చర్చకి సిద్ధమా అని సవాల్ విసిరారు. ఈ సిల్లీ బచ్చా సబ్జెక్ట్‌లో హాఫ్ నాలెడ్జ్ కాని అవినీతిలో ఫుల్ నాలెడ్జ్ అని అన్నారు. బినామి పేరుతో సిల్లీ బచ్చాకి ఎన్నో కోట్లు ఉన్నాయని నారా లోకేష్ అన్నారు. ఎలక్షన్ కి కొన్ని రోజుల ముందు సిల్లీ బచ్చా పరార్ అవుతారు. రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు నగర ఇన్ ఛార్జి పొంగూరి నారాయణ నేతృత్వంలో వేలాది కార్యకర్తలు యువనేతకు బ్రహ్మరథం పట్టారు.
అయితే నారా లోకేష్ ) చేసిన వ్యాఖ్యలపై నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆరోపణలపై ప్రమాణాలకు సిద్ధమంటూ లోకేష్ కు అనిల్ ఈ సందర్బంగా సవాల్ విసిరారు. తనపై చేసిన ఆరోపణల మీద తిరుమల కొండ పై ప్రమాణానికి సిద్దం..నిజం చెబితే తల పది వేల ముక్కలు అవుతుందని లోకేష్ కు శాపం అన్నారు. ఇక నెల్లూరు జన సమీకరణ కోసం లోకేష్ ఒక రోజు పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారని..సభ పెట్టిన పక్కనే ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి మాల వెయ్యకపోవడం సిగ్గు చేటని అనిల్ చురకలు అంటించారు.
రాజకీయాల్లోకి రాక ముందు నా తండ్రి ఇచ్చిన ఆస్తి కన్నా..ఒక్క రూపాయి ఎక్కువ ఉందని నిరూపించే దమ్ము లోకేష్ కి ఉందా..? కార్పొరేటర్లు లేఅవుట్లు వేస్తే..దాన్ని కూడా తానే వేసినట్లు ఆరోపణలు చేస్తున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పిన అజీజ్ ను ఎందుకు పక్కన పెట్టారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 30 ఏళ్ళు రాజకీయ పార్టీలు తిరిగినా..టికెట్ ఇవ్వకపోతే.. జగన్ రెండు సార్లు శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. నారాయణ 50 లక్షలు ఇంటికి పంపితే తిరిగి పంపానని అనిల్ అన్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…