SS Rajamouli : లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కొడుకు శ్రీ సింహ కోడూరి ‘మత్తు వదలరా’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ హీరో అనంతరం..’తెల్లవారితే గురువారం’, ‘దొంగలున్నారు జాగ్రత్త’ లాంటి సినిమాలు చేశాడు. ఈ చిత్రాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక తాజాగా ఆయన ఉస్తాద్ చిత్రంతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. ఈ మూవీ ఆగస్ట్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫణిదీప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బలగం బ్యూటీ కావ్య కల్యాణ్ రామ్ హీరోయిన్ గా నటిస్తోంది. సాయి కొర్రపాటి, క్రిషీ ఎంటర్తైన్మెంట్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్స్ ఆకట్టుకున్నాయి.
మూవీ రిలీజ్ కు మరో రెండు రోజుల మాత్రమే ఉండటంతో మేకర్స్ మూవీ ప్రమోషన్స్ షురూ చేశారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.. ఈ ఆడియో ఈవెంట్‌కు స్టార్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఇక చీఫ్ గెస్ట్‌గా న్యాచురల్ స్టార్ నాని సందడి చేశారు. ఇక కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతూ.. అబ్బాయిలు ఫస్ట్ లవ్ మరచిపోతారేమో కాని, ఫస్ట్ బైక్ మరిచిపోరని అన్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ చూడగానే నా పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. ఫణిదీప్ రాసుకున్న కథ బాగుంది, సంగీతం కూడా చాలా నచ్చింది. కారులో వెళుతున్నప్పుడు ఈ సాంగ్స్ వింటుంటా.
9లేదా 10 కోట్లతో సినిమా లేదు, 35 కోట్లతో తీసిన సినిమాలా ఇది ఉందని అన్నారు రాజమౌళి. నేను , పెద్దన్న కష్టపడిపైకి ఎలా వచ్చామో శ్రీసింహ కూడా అలానే పైకి రావాలని అనుకుంటున్నాడు అని రాజమౌళి స్పష్టం చేశారు. ఈ మూవీలో రజనీ కొర్రపాటి, రాకేశ్ రెడ్డి గడ్డం, హిమంక్ రెడ్డి దువ్వూరు కీ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రంలో డైరెక్టర్ కమ్ యాక్టర్ గౌతమ్ వాసు దేవ్ మీనన్ మరో కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీకి అకీరా బీ సంగీతం అందిస్తున్నారు. ఎయిర్‌ఫోర్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతోంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…