Sreeleela : ఈ మధ్య సినిమాల ద్వారా కంటే సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ మంది పాపులారిటీ దక్కించుకుంటున్నారు .. ఇలా సోషల్ మీడియా ద్వారా పాపులారిటిని సంపాదించుకున్న వారిలో శ్రీలీల కూడా ఒకరు. ఈ అమ్మడు సినిమాలతో పాటు సోషల్ మీడియా ద్వారా కూడా తెగ సందడి చేస్తుంది. టాలీవుడ్ హీరోయిన్లలో ది బెస్ట్ డ్యాన్సర్ అని పేరు తెచ్చుకున్న శ్రీలీల. ఈ అమ్మడు శేఖర్ కలిసి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెర మీద శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసే స్టెప్పులు శ్రీలీల వేస్తుంటుంది. కానీ శ్రీలీల, శేఖర్ మాస్టర్ కలిసి స్టెప్పులు వేస్తే ఎలా ఉంటుందో చూపించేశారు.
నితిన్ వక్కంతం వంశీ కాంబోలో సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. ఎక్స్ ట్రా ఆర్డినరీ మెన్ అంటూ నితిన్ మరో ప్రయోగాన్ని చేస్తున్నాడు. నా పేరు సూర్య తరువాత వక్కంతం వంశీ చేస్తోన్న ప్రాజెక్ట్ కావడంతో అందరిలోనూ ఓ మంచి అంచనాలే ఉన్నాయి. ఇన్నాళ్లు కసి మీద ఉండి కథ, స్క్రిప్ట్‌ను రాసుకుని ఉంటాడని, ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అంతా అనుకుంటున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. హారీస్ జయరాజ్ చాలా రోజుల తరువాత తెలుగు సినిమాకు సంగీతాన్ని అందించగా ఆయన పాటలకి మంచి రెస్పాన్స్ వస్తుంది.
డేంజర్ పిల్లా అంటూ సాగే ఈ పాట ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. షార్ట్స్, రీల్స్‌లోనూ ఈ పాట వైరల్ అవుతోంది. శేఖర్ మాస్టర్, శ్రీలీల కలిసి డేంజర్ పిల్ల పాటకు అదిరిపోయే స్టెప్పులేశారు.. ఇద్దరు కలిసి చేసిన ఈ రీల్… నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సాంగ్ కోసం శేఖర్ మాస్టర్, శ్రీలీల చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.. అసలే డాన్స్ లో ఇద్దరికి ఇద్దరు.. అనిపించారు. శేఖర్ మాస్టర్ లాంటి అద్భుతమైన ఎనర్జిటిక్ డాన్సర్ కు పోటీగా శ్రీలీల గ్రేస్ మూమెంట్స్‌తో అందరిని అకట్టుకుంది. శ్రీలీల మాస్టర్‌కు ఏమాత్రం తక్కువ కాకుండా.. తీసిపోకుండా చాలా స్టైల్‌గా చేస్తుంది. ఇక టాలీవుడ్ ఆడియన్స్ ఈ డాన్స్ కు ఫిదా అవుతున్నారు. కొందరైతే శేఖర్ మాస్టర్‌ను డామినేట్ చేశావ్ కదా అంటున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…