Sreeleela : ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసిన శ్రీలీల‌

Sreeleela : శ్రీలీల‌.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తెలుగు రాష్ట్రాలలో ఇటీవ‌ల ఈ అమ్మ‌డి పేరు బాగా వినిపిస్తుంది. వ‌రుస సినిమాలు చేస్తూ ఎంత‌గానో అల‌రిస్తుంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందD సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కన్నడ అందం శ్రీలీల. ఒకే సినిమాతో మంచి పాపులారిటీని తెచ్చుకుంది. ఆ తర్వాత శ్రీలీల రవితేజ సరసన ధమాకాలో నటించి మరో హిట్‌ను అందుకుంది. ఇక తాజాగా శ్రీలీల, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన భగవంత్ కేసరిలో నటించి మరో బంపర్ హిట్‌ను అందుకుంది.

శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్’లో మారుమోగుతున్న పేరు. ఇటీవ‌లి కాలంలో రిలీజ్ అయ్యే ప్ర‌తి సినిమాలో శ్రీలీల న‌టిస్తుంది.. ఈ భామ ప్రస్తుతం ఓ పది సినిమాల్లో నటిస్తూ సూపర్ బిజీగా ఉంది. ధమాకా హిట్‌తో ఒక్కసారిగా ఫామ్‌లోకి వచ్చిన శ్రీలీల తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది. కుర్ర హీరోల ఫేవరేట్ కోస్టార్‌గా మారింది. ఇక ఈ భామ నటించిన లేటెస్ట్ సినిమా భగవంత్ కేసరి.. ఈ అక్టోబర్ 19న భారీగా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ‘భగవంత్‌ కేసరి’ చిత్రంలో విజ్జీ పాప పాత్రలో ఈ అమ్మడి అభినయానికి అంతటా ప్రశంసలు దక్కుతున్నాయి. మీడియా ఇంటర్వ్యూల సందర్భంగా చక్కటి సెన్సాఫ్‌ హ్యూమర్‌తో ఆకట్టుకునే ఈ అమ్మడు తెరపై లిప్‌లాక్‌ సన్నివేశాలపై తనదైన శైలిలో సమాధానమిచ్చింది.

Sreeleela interesting comments on pawan kalyan
Sreeleela

లిప్‌లాక్‌ సీన్స్‌లో తాను అస్సలు నటించనని, ఈ విషయంలో రాజీపడనని స్పష్టం చేసింది. తన మొదటి లిప్‌లాక్‌ భర్తకే ఇస్తానని చెప్పుకొచ్చింది. కథల ఎంపికలో క్రమంగా తన ప్రాధాన్యతలు మారుతున్నాయని, నటిగా ప్రతిభను చాటుకునే పాత్రల కోసం ఎదురుచూస్తున్నానని పేర్కొంది. ఇక త్వ‌ర‌లో ఆదికేశవ చిత్రంతో ప‌ల‌క‌రించ‌నుండ‌గా, ఈ మూవీ ప్ర‌మోష‌న్‌లో భాగంగా ప‌లువురు హీరోల గురించి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి చైబుతూ డివైన్ అని పేర్కొంది. ఇక మ‌హేష్ బాబు స్వీటెస్ట్ అని తెలియ‌జేసింది. అలా పలువురు హీరోల గురించి ఆస‌క్తికర కామెంట్స్ చేసి హైలైట్ అయింది శ్రీలీల‌.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago