Sreeleela : నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన చిత్రం భగవంత్ కేసరి. ఈరోజు విడుదలైన ఈ సినిమాకు బాలయ్య అభిమానులు ఫిదా అవుతున్నారు. సినిమాలో బాలయ్య కొత్తగా కనిపించారని, అనిల్ రావిపూడి ఈ సినిమాను భిన్నంగా తీశారని అంటున్నారు. భగవంత్ కేసరి సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అంతే కాదు థియేటర్ల వద్ద జై బాలయ్య నినాదం మారుమ్రోగుతోంది. ఇక బాలయ్య మునుపెన్నడూ లేని విధంగా ఈ సినిమాలో నటించారు. ఇక ఈ సినిమాలో బాలయ్య తొలిసారిగా తెలంగాణ యాసలో మాట్లాడారు. ఇక ఆయన చెప్పిన డైలాగ్స్ కు థియేటర్లలో విజిల్స్ పడుతున్నాయి. తమన్ మ్యూజిక్ అఖండ రేంజులో లేదని అంటున్నారు.
విజ్జి పాప రోల్ లో శ్రీలీల ఇరగదీసిందని అంటున్నారు. థియేటర్‌లో తన పాత్రకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలని శ్రీలీల భ్రమరాంబ థియేటర్‌కి వెళ్లింది. అక్కడ ప్రేక్షకులు తెగ ఇబ్బంది పెట్టారు. అభిమానుల మధ్య నుండి ఎలాగోలా శ్రీలీల థియేటర్‌కి వెళ్లి సినిమా చూసింది. మరోవైపు బాలయ్య చిన్న కూతురు తేజస్విని ఆమె కొడుకులు సైతం భగవంత్ కేసరి చిత్రాన్ని థియేటర్‌లో చూశారు. థియేటర్‌లో సినిమా చూడడం వారికి చాలా థ్రిల్ కలిగించింది. ఇక ఇదిలా ఉంటే విజ్జి పాప పాత్ర కోసం మొదట కృతి శెట్టిని అప్రోచ్ అయ్యారట అనిల్ రావిపూడి . అయితే కూతురు పాత్ర అంటూ సాగదీసి చేయను అంటూ హ్యాండ్ ఇచ్చిందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ తర్వాత శ్రీలీలను ఈ పాత్రకు చూస్ చేసుకున్నారట మేకర్స్.
ఇక భగవంత్ కేసరి సినిమాకు ఫ్యాన్సీ ధర చెల్లించి అమెజాన్ ప్రైమ్ భగవంత్ కేసరి హక్కులు దక్కించుకున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా ఓ టి టి లోకి ఎప్పుడు వస్తుంది అని కూడా ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతుంది. నేడు థియేటర్లో విడుదలైన ఈ సినిమా థియేటర్లో మూడు నాలుగు వారాలు నడిచిన తర్వాత ఓ టి టి లో స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…