Nara Bhuvaneshwari : చంద్రబాబు అరెస్ట్ అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఒకవైపు చంద్రబాబును జైలు నుంచి విడుదల చేసేందుకు నారా లోకేష్ విశ్వప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమయ్యారు నారా భువనేశ్వరి. ‘నిజం గెలవాలి’ అంటూ యాత్ర చేపట్టబోతున్నారు నారా భువనేశ్వరి. తాజాగా ఏపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు మద్దతుగా, రాజమహేంద్రవరంలో ఉన్న తనను కలిసి మనోధైర్యాన్ని ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంఘీభావ యాత్ర చేపడితే.. అందులో తప్పేంటని ప్రశ్నించారు.
తనకు సంఘీభావం తెలిపేవారికి నోటీసులు ఇవ్వడాన్ని భువనేశ్వరి ట్విట్టర్ వేదికగా తప్పుబట్టారు. భువనేశ్వరిని కలిసేందుకు వెళితే చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. ఈ అంశాన్ని ఆమె ప్రస్తావించారు. పార్టీ కార్యకర్తలు మా బిడ్డల్లాంటి వాళ్లు.. బాధలో ఉన్న అమ్మను కలిస్తే చర్యలు తీసుకుంటామని నోటీసులు ఇస్తారా?నన్ను కలవకూడదని చెప్పడానికి ఈ ప్రభుత్వానికి హక్కు ఎక్కడిది’’ అని ప్రశ్నిస్తూ భువనేశ్వరి ట్వీట్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి అండగా.. రాజమహేంద్రవరంలో ఉన్న నారా భువనేశ్వరికి పార్టీ నేతలు, శ్రేణులు తరలివస్తున్నారు. అయితే రాజమహేంద్రవరం వస్తున్న వారికి నోటీసులు ఇవ్వడాన్ని భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక ఇదిలా ఉంటే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 19వ తేదీకి వాయిదా పడింది. చంద్రబాబు తరఫు న్యాయవాదుల అభ్యర్థన మేరకు హైకోర్ట్ విచారణను వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై తిరిగి 19న పూర్తి స్థాయిలో వాదనలు చేపట్టే అవకాశం ఉంది. అంతేకాదు ఇవాళ చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పైనా సుప్రీం కోర్టులో విచారణ జరగనున్న సంగతి తెలిసిందే. ఇవాళ ఫైనల్ వాదనలు వినిపించిన తర్వాత కోర్టు నిర్ణయం ఎలా ఉంటుందనే దానిపై అందరిలో ఎంతో ఆసక్తి నెలకొంది. కాగా, చంద్రబాబు అరెస్టు తర్వాత.. పలువురు టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఆ కుటుంబాలను పరామర్శించాలని ఆయన నారా భువనేశ్వరి నిర్ణయించుకున్నారు. ప్రతీ వారం రెండు, మూడు ప్రాంతాలకు వెళ్లి ఇలాంటి కుటుంబాలను పరామర్శించాలని నిర్ణయం తీసుకున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…