Mallareddy : మంత్రి మల్లారెడ్డికి సినీ సెలబ్రిటీలకి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటీవల కాలంలో ఆయన చెప్పిన డైలాగులు తెగ వైరల్ అవుతున్నాయి. మైకు పట్టుకున్నారంటే.. జనాల ముఖాల్లో నవ్వులు గ్యారెంటీ అన్నట్టే. ఆయన కామెడీ చేస్తారని కాదు.. ఆయన మాట్లాడే తీరును జనాలు ఎంజాయ్ చేస్తారని. ఆయన స్పీచుకు.. జనాలే కాదు.. రాజకీయ నేతలు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అందులో మంత్రి కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్సీ కవిత కూడా ఉన్నారు. రీసెంట్‌గా మంత్రి మల్లారెడ్డి ఇప్పుడు సీఎం కేసీఆర్‌ను కూడా నవ్వించారు. అప్పుడెప్పుడో.. పాలమ్మినా, పూలమ్మినా, కష్టపడ్డా.. సక్సెస్ అయినా.. ఎమ్మెల్యే అయినా.. మంత్రినైనా.. అంటూ అసెంబ్లీ మొత్తాన్ని కడుపుబ్బా నవ్వించిన మల్లారెడ్డి… ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో.. తనదైన స్టైల్‌లో స్పీచ్ ఇచ్చి గులాబీ బాస్ కేసీఆర్ ముఖంలో నవ్వులు పూయించారు.
ఇక మచ్చలేని లీడర్ కేసీఆర్ అని, ప్రజల హృదయాల్లో నిలిచారని, ముచ్చటగా మూడోసారి సీఎంగా గెలవడం ఖాయమని అన్నారు. పీల్చే గాలి, పారే నీరు, పండే పైర్లు.. తెలంగాణ జోరు.. అది కేసీఆర్‌తోనే సాధ్యమైందన్నారు. రాజకీయాలకతీతంగా సబ్బండవర్గాల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, అమలు చేస్తున్న ఘనత కేసీఆర్‌దే అని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశానికి ఆదర్శప్రాయంగా ఉన్నాయని, ఇతర రాష్ట్రాలని ఆకర్షిస్తున్నాయని కొనియాడారు.. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను చూసిన సమీప రాష్ర్టాల ప్రజలు తమకు కూడా కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నారన్నారు.
అయితే మేడ్చల్ సభలో మధుప్రియ.. మల్లారెడ్డితో కలిసి తెగ సందడి చేసింది. భుజంపై ఎర్రని తువాలు వేసుకొని పాట పాడుతూ మల్లారెడ్డితో డ్యాన్స్ చేయించింది. అంతేకాదు ఇద్దరి మధ్య సరదాగా కొంత చర్చ జరిగింది. మల్లారెడ్డి ఏదో అనడం, ఆమె మైక్ తీసుకోవడం ఆ మైక్ అడుగుతున్నా కూడా మధుప్రియ మైక్ తీసుకెళ్లి వేరే వారికి ఇవ్వడం తిరిగి అది మల్లారెడ్డి తీసుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…